మద్యం సేవించి.. మహిళలతో చిందులేసి.. అశ్లీల నృత్యాలు..

Published : Apr 06, 2021, 11:36 AM IST
మద్యం సేవించి.. మహిళలతో చిందులేసి.. అశ్లీల నృత్యాలు..

సారాంశం

హైదరాబాద్, పాతబస్తీలోని బండ్లగూడ లో జరిగిన అశ్లీల నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఓ పార్టీకి చెందిన నాయకుడు ఇచ్చిన విందులో మహిళలు అశ్లీల నృత్యాలు చేశారు.   

హైదరాబాద్, పాతబస్తీలోని బండ్లగూడ లో జరిగిన అశ్లీల నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఓ పార్టీకి చెందిన నాయకుడు ఇచ్చిన విందులో మహిళలు అశ్లీల నృత్యాలు చేశారు.   

ఫిబ్రవరి 13న జరిగిన ఈ విందులో సదరు నాయకుడు, స్నేహితులు మద్యం సేవించి.. మహిళలతో చిందులు వేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పర్వేజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన జరిగిన సమయంలో వెంటనే దాడి చేస్తే వివరాలు తెలిసేవని, ప్రస్తుతం కేవలం వీడియో మాత్రమే ఉన్నందున దానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా మహిళలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? వాళ్ళు ఇక్కడి వాళ్ళేనా? లేక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్