ఆట పట్టించిన తోటి విద్యార్ధులు: ఆత్మహత్య చేసుకొన్న మహేందర్

Published : Mar 02, 2021, 07:25 AM IST
ఆట పట్టించిన తోటి విద్యార్ధులు: ఆత్మహత్య చేసుకొన్న మహేందర్

సారాంశం

తోటి విద్యార్ధులు ఆట పట్టించడం.. ప్రైవేటుగా చదువుతానని కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో మనోవేదనకు గురైన ఓ విద్యార్ధి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.

వికారాబాద్:తోటి విద్యార్ధులు ఆట పట్టించడం.. ప్రైవేటుగా పరీక్షలు రాస్తానని కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో మనోవేదనకు గురైన ఓ విద్యార్ధి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.

వికారాబాద్ జిల్లాలోని కొత్తగడి గ్రామానికి చెందిన యువకుడు మహేందర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. మహేందర్ మాత్రం ఆ క్లాసులో అందరి కంటే పెద్దవాడుగా ఉన్నాడు. దీంతో క్లాసులో తోటి విద్యార్ధులు అతడిని ఆట పట్టించేవారు. దీంతో తాను స్కూల్ కు వెళ్లనని అతను కుటుంబసభ్యులకు చెప్పాడు.

ప్రైవేట్ గా 10వ తరగతి పరీక్షుల రాస్తానని ఇంట్లో చెప్పాడు. అయితే రెగ్యులర్ గానే స్కూల్ కు వెళ్లాలనని కుటుంబసభ్యులు మహేందర్ కు తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనను కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. స్కూల్ కు వెళ్లాల్సిందేనని చెప్పారు.

దీంతో సోమవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేందర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.  సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి, సోదరుడు ఇంటి తలుపులు విరగ్గొట్టి చూస్తే మహేందర్ ఉరేసుకొని ఉన్నాడు.

మహేందర్ ను ఆసుపత్రికి తరలించేసరికి అప్పటికే అతను మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.నెల రోజుల క్రితమే మహేందర్ తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఈ విషాదం నుండి తేరుకోకముందే  మహేందర్ ఉరేసుకొని చనిపోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?