వికారాబాదులో చచ్చిపోయే మనిషిని బతికించిన ఎమ్మెల్యే

Published : Mar 02, 2021, 07:26 AM IST
వికారాబాదులో చచ్చిపోయే మనిషిని బతికించిన ఎమ్మెల్యే

సారాంశం

యాక్సిడెంట్ అయిన ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండడం గమనించిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తన వాహనం దిగి, అతన్ని పరీక్షించి, సీపీఆర్ చేశారు. ఆ తర్వాత స్వయంగా ఎత్తుకుని ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.

వికారాబాద్: తెలంగాణలోని వికారాబాద్ పట్టణంలో  కొండా బాలకృష్ణ రెడ్డి గార్డెన్ ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి యాక్సిడెంట్  అయి రోడ్డుపై పడి ఉన్నాడు. అదే రోడ్ గుండా వెళ్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అది గమనించారు 

వెంటనే ఆయన తన వాహనం  దిగి, ఆయన దగ్గరికి వెళ్లారు. స్వయంగా వైద్యులు అయిన ఎమ్మెల్యే సదరు వ్యక్తిని గమనించగా, నాడీ కొట్టుకోకపోవటం ,గుండె ఆగిపోవటం గుర్తించారు. వెంటనే సిపిఆర్ (cardiopulmonary resuscitation చాతి పై వత్తటం) చేశారు. 

నాడి యధావిధిగా కొట్టుకోవడం మొదలైన తర్వాత ఆయనను స్వయంగా మోసుకొని పోయి, ఆటోలో ఎక్కించి , హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలనీ ఆసుపత్రి వైద్యులను ఫోన్ చేసి ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే