ఇంటికి రావొద్దన్నారు, వేధింపులు: మాధురి మృతిపై తండ్రి

By narsimha lodeFirst Published Oct 14, 2018, 12:11 PM IST
Highlights

 తన కూతురును  కట్నంతో పాటు ఇతర రకంగా వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని మాధురి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు


హైదరాబాద్: తన కూతురును  కట్నంతో పాటు ఇతర రకంగా వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని మాధురి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురు చావుకు కారణమైన భర్త, అత్త,మామలను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితమే  అమెరికా నుండి  వచ్చిన మాధురి శనివారం సాయంత్రం పుట్టింట్లోనే  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కోటేశ్వరరావుతో  అమెరికాలో ఉంటున్న  మాధురి భర్త పెట్టే  వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అమెరికా నుండి  వచ్చిన మాధురి అత్తకు ఫోన్ చేస్తే  ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని మాధురి తండ్రి మాల్యాద్రి ఆరోపించారు. అయితే తాను అమెరికా నుండి వచ్చిన విషయాన్ని  మామయ్యకు  చెప్పాలని  కూడ  ఆమె చెప్పినా కూడ  పట్టించుకోకుండా  దుర్భాషలాడిందని మాల్యాద్రి చెప్పారు.

ఆదివారం నాడు ఓ టీవీఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మాల్యాద్రి  తన కూతురు చావుకు అత్తింటివాళ్లే కారణమన్నారు. తమ ఇంటికి రావొద్దని  మాధురి అత్త ఫోన్‌లో చెప్పిందని ఆయన చెప్పారు. ఈ విషయాలను మనసులో పెట్టుకొన్న మాధురి ఆత్మహత్య చేసుకొందన్నారు. తన కూతురు చావుకు కారణమైన  అత్త, మామ, భర్తలను కఠినంగా శిక్షించాలని  ఆయన డిమాండ్ చేశారు.
 

సంబంధిత వార్తలు

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

 

click me!