Ramzan 2022: ముస్లిం సోదరులకు 29న కేసీఆర్ ఇఫ్తార్‌ విందు

Siva Kodati |  
Published : Apr 23, 2022, 10:18 PM IST
Ramzan 2022: ముస్లిం సోదరులకు 29న కేసీఆర్ ఇఫ్తార్‌ విందు

సారాంశం

రంజాన్‌ను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎం కేసీఆర్ వివరాలు తెలిపారు. ఈ నెల 29న సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. 

పవిత్ర రంజాన్ (Ramzan 2022 ) మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం (telangana govt ) తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. 

ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచిందన్నారు. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు  ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. లౌకికవాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్