కేసీఆర్ గారు తెగ ఆరాటపడ్డారు.. మొత్తం క్రెడిట్స్ హైజాక్ చెయ్యాలని.. : రాములమ్మ ఫైర్..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 09, 2020, 10:27 AM ISTUpdated : Dec 09, 2020, 11:32 AM IST
కేసీఆర్ గారు తెగ ఆరాటపడ్డారు.. మొత్తం క్రెడిట్స్ హైజాక్ చెయ్యాలని.. : రాములమ్మ ఫైర్..

సారాంశం

తాజాగా బీజేపీలో చేరిన విజయశాంతి కేసీఆర్ మీద తనదైన స్టైల్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన భారత్ బంద్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడ్డారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు

తాజాగా బీజేపీలో చేరిన విజయశాంతి కేసీఆర్ మీద తనదైన స్టైల్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన భారత్ బంద్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడ్డారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. 

సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రశ్నలు సంధించారు రాములమ్మ.. 
‘‘కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన బంద్‌లో చివరి క్షణంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తెగ ఆరాటపడ్డారు. సీఎం గారి ఎత్తుగడలు జీర్ణించుకోలేక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కొత్త వ్యూహంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బంద్ చేశామని చెబుతున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు త్వరలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన చెయ్యాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. దీని ద్వారా కేసీఆర్‌ను కూడా ఇరకాటంలో పెట్టాలని వారి వ్యూహం. 

రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపునకు మద్దతిచ్చిన కేసీఆర్ గారు, మరి ఆ పార్టీలు తెలంగాణలో చేసే ఆందోళనల్ని కూడా సమర్థిస్తారా? రైతు బంధునని చెప్పుకుని, ఫాంహౌస్ రాజకీయాలతో రాబందులా వ్యవహరించే సీఎం దొరగారి నిజ స్వరూపం తెలియడం వల్లే ఆయన తుపాకి రాముడు మాటలను నమ్మలేక దుబ్బాక ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన రైతులు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu