రేవంత్ రెడ్డికి అసంతృప్తి సెగలు.. తీరు బాలేదంటున్న కాంగ్రెస్‌ నేతలు..

Published : Dec 09, 2020, 10:11 AM IST
రేవంత్ రెడ్డికి అసంతృప్తి సెగలు.. తీరు బాలేదంటున్న కాంగ్రెస్‌ నేతలు..

సారాంశం

కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.  రేవంత్‌రెడ్డి తీరుపై రంగారెడ్డి జిల్లా, కొత్తూరు స్థానిక కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.  రేవంత్‌రెడ్డి తీరుపై రంగారెడ్డి జిల్లా, కొత్తూరు స్థానిక కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

రైతు దీక్షలో పాల్గొనేందుకు మంగళవారం షాద్‌నగర్‌ వెళ్తున్న ఆయనకు మండల పార్టీ అధ్యక్షుడు జే. సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో వీర్లపల్లి శంకర్‌ తదితరులు తిమ్మాపూర్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. 

కాగా పార్టీలోని మరో వర్గం నేత కే. శ్రీనివాస్‌గౌడ్‌ సైతం రైతులకు మద్దతుగా మండల కేంద్రంలోనే ధర్నా చేపట్టారు. ఈ శిబిరం పక్క నుంచే రేవంత్‌రెడ్డి వెళ్లినప్పటికీ తమను పట్టించుకోకపోవడంతో పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పార్టీలో అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిపై ఉందని, స్థానిక నేతలు కొందరు ఆయనను శిబిరం వద్దకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: అల్ప‌పీడ‌న ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ఖాయం
Kavitha: ఈసారి కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌డ‌తారా లేదా.? అన్న‌పై చెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు