వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూ గిఫ్ట్: వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్

Published : Sep 19, 2021, 11:29 AM IST
వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూ గిఫ్ట్: వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్

సారాంశం

తాము వేలంలో దక్కించుకున్న బాలాపూర్ లడ్డును ఏపీ సీఎం వైెఎస్ జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పారు. మిత్రుడు శశాంక్ రెడ్డితో కలిసి ఆయన బాలాపూర్ లడ్డును దక్కించుకున్నాడు.

హైదరాబాద్: బాలాపూర్ లడ్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పారు. మిత్రుడు మర్రి శశాంక్ రెడ్డితో కలిసి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బాలాపూర్ లడ్డును రికార్డు ధరకు వేలంలో పాడుకున్న విషయం తెలిసిందే. 

తాము పాడుకున్న బాలాపూర్ లడ్డును జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని రమేష్ యాదవ్ చెప్పారు. యేటా బాలాపూర్ లడ్డును రికార్డు ధరకు దక్కించుకోవడం ఆనవాయితీగా మారింది. దాన్ని దక్కించుకోవడానికి పెద్ద యెత్తున పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కూడా పోటీ తీవ్రంగానే జరిగింది. 

Also Read: బాలాపూర్ లడ్డు: ఇప్పటివరకు లడ్డు దక్కించుకొంది వీరే...

ఈసారి బాలాపూర్ లడ్డును 18 లక్షల 90 వేల రూపాయలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డను దక్కించకోవడం సంతోషంగా ఉందని వారన్నారు. జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో తాము వేలం పాటలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. వినాయకుడి కృపతో రాష్ట్రం బాగుండాలని రమేష్ యాదవ్ అన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

కాగా, హైదారబాదులో ఆదివారంనాడు వినాయక నిమజ్జనం జరుగుతోంది. హైదరాబాదులో శోభా యాత్ర ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడు కూడా నిమజ్జనానికి కదిలాడు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లోనే గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu