పెళ్లికి క్షణాల ముందే వరుడు జంప్: తాళి కట్టిన మరో యువకుడు

By narsimha lodeFirst Published Dec 30, 2018, 12:07 PM IST
Highlights

పెళ్లికి కొన్ని క్షణాల ముందు పెళ్లి మండపానికి వెళ్తూ మార్గమధ్యలోనే  వరుడు పారిపోవడంతో మరో యువకుడు పెళ్లికి ముందుకు రావడంతో  రద్దు కావాల్సిన పెళ్లి జరిగింది

హుస్నాబాద్: పెళ్లికి కొన్ని క్షణాల ముందు పెళ్లి మండపానికి వెళ్తూ మార్గమధ్యలోనే  వరుడు పారిపోవడంతో మరో యువకుడు పెళ్లికి ముందుకు రావడంతో  రద్దు కావాల్సిన పెళ్లి జరిగింది.  వధువును పెళ్లి చేసుకొనేందుకు ముందుకు వచ్చిన ఆ యువకుడిని పలువురు అభినందించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పొట్లపల్లి గ్రామానికి చెందిన  కోల రాజలింగు, భూలక్ష్మి దంపతులు తమ కూతురును  చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి శ్రీనివాస్ కు ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారు. డిసెంబర్ 29వ తేదీన పెళ్లికి ముహుర్తంగా నిర్ణయం తీసుకొన్నారు.

పెళ్లి మండపానికి వాహనంలో వెళ్తూ వరుడు శ్రీనివాస్ పారిపోయాడు. శ్రీనివాస్  నుస్తులాపూర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం రెండు కుటుంబాలకు కూడ తెలుసు  పెద్దలు నిర్ణయం కారణంగా శ్రీనివాస్ ఈ పెళ్లికి  ఒప్పుకొన్నాడని చెబుతున్నారు.

కానీ, పెళ్లి మండపానికి వెళ్లే దారిలో ఈ పెళ్లి ఇష్టం లేని శ్రీనివాస్  పారిపోయాడు. అయితే వధువును రమేష్ అనే అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. కానీ శ్రీనివాస్ కు ఇచ్చి వివాహం చేయాలని శ్రీనివాస్ తల్లి వధువు కుటుంబసభ్యులను కోరింది. దీంతో వధువు కుటుంబసభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకొన్నారని అంటున్నారు.

ఈ  పెళ్లి ఇష్టం లేని శ్రీనివాస్  పారిపోవడంతో పెళ్లి మండపంలోనే రమేష్ తల్లిదండ్రులతో  మాట్లాడి ఈ పెళ్లికి ఒ:ప్పించారు.రమేష్ కూడ ఈ పెళ్లికి  ఒప్పుకోవడంతో  పెద్దలు కూడ ఒప్పుకొన్నారు.  ఆ వధువును  పెళ్లి చేసుకోవడంతో   రమేష్‌ను పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు

షాక్:పెళ్లికి గంటల ముందే వరుడు జంప్

 

click me!