వనమా రాఘవ నా భార్యను పంపించాలని అడిగాడు: రామకృష్ణ సెల్ఫీ వీడియో

By narsimha lodeFirst Published Jan 6, 2022, 9:28 AM IST
Highlights

పాల్వంచలోని తూర్పు బజారులోని భార్యా పిల్లలతో ఆత్మహత్య  చేసుకొన్న రామకృష్ణ  కేసులో మరో ట్విస్ట్ చేసుకొంది. తన భార్యాను కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేందర్ పంపాలని కోరాడని ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్పీ వీడియోలో కోరారు.
 

ఖమ్మం:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని palwancha తూర్పు బజారులో  భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్న రామృష్ణ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు Rama krihsnaసెల్పీ వీడియో తీసుకొన్నాడు.ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో వనమా రాఘవ  దురాగతాలను రామకృష్ణ బయట పెట్టాడు.  తన భార్యను తీసుకొని హైద్రాబాద్ కు రావాలని Vanama Raghavender ఆర్ఢర్ వేశాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేందర్ తీరుతోనే తాము ఆత్మహత్య చేసకోవాలని నిర్ణయం తీసుకొన్నామని రామకృష్ణ వివరించారు.

ఈ నెల 3 వ తేదీన  పాల్వంచలో  రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు  సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది.

ఈ సెల్పీ వీడియోలో వనమా రాఘవేందర్ తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. పిల్లలు లేకుండా తన భార్యతో హైద్రాబాద్ కు వస్తేనే తన సమస్యను పరిష్కరిస్తానని వనమా రాఘవేందర్ తనను బెదిరించారన్నారు. శ్రీలక్ష్మితో తన వివాహమై 12 ఏళ్లైనా ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. డబ్బులైతే ఇస్తాం కానీ, భార్యను ఎలా పంపాలని ఆయన ప్రశ్నించారు.

నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు.రాజకీయ, ఆర్ధిక బలుపు ఉన్న వనమా రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని  రామకృష్ణ అడిగారు.  వనమా రాఘవ వల్ల ఎన్నో  కుటుంబాలు నాశనమయ్యాయని  రామకృష్ణ గుర్తు చేశారు. 

నీ సమస్య తీరాలంటే నీ భార్యను  తీసుకొని హైద్రాబాద్ కు రా.. అప్పటి వరకు  నీ సమస్య పరిష్కారం కాదని  రాఘవేందర్ తెగేసి చెప్పాడన్నారు. ఎవరి వద్దకు వెళ్లినా కూడా ఎవరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేరని రాఘవేందర్ తనను బెదిరించినట్టుగా రామకృష్ణ  వివరించారు. ఎదుటి మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి  రాఘవేందర్ తన పబ్బం గడుపుకొంటున్నాడని రామకృష్ణ చెప్పారు.  

also read:పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటన: కేసును విత్ డ్రా చేసుకో.. మృతుడి బావమరిదికి బెదిరింపులు

వనమా రాఘవేందర్ వల్లే ఇటీవలనే పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడని  ఆయన గుర్తు చేశారు. ఈ కేసుతో నెల రోజుల పాటు బయటకు రాకుండా ఉన్న రాఘవేందర్ ప్రస్తుతం తనను వేధిస్తున్నాడని రామకృష్ణ ఆవేదన చెందారు.నేను ఒక్కడినే చనిపోతే నా భార్య పిల్లలను వదిలి పెట్టడు, వనమా రాఘవేందర్ బారిన పడకుండా తన భార్యా పిల్లలను కూడా తీసుకెళ్తున్నానని రామకృస్ణ ఆ సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.

రాఘవేందర్ వల్ల పట్టణంలో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కొందరు బయటకు వచ్చి చెప్పుకొన్నారు, మరికొందరు బయటకు రాలేదని రామకృష్ణ వివరించారు.తాను ఎలాంటి వాడినో, వనమా రాఘవేందర్ ఎలాంటి వాడో పట్టణ ప్రజలకు తెలుసునని ఆయన తెలిపారు.తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బులను తనకు అప్పులు ఇచ్చిన వారికి ఇవ్వాలని పట్టణ పెద్దలు, రాజకీయ పార్టీల నేతలను రామకృష్ణ కోరారు. మిగిలిన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాతి నుండి రాఘవేందర్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. రామకృష్ణ సూసైడ్ నోట్ లో తన పేరును ఎందుకు రాశాదో తెలియదని వనమా రాఘవేందర్  మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. రాజకీయంగా తనను అప్రదిష్టపాల్జేసేందుకే రామకృష్ణను ప్రేరేపించి తనపై ఆరోపణలు చేయించాడని  వనమా రాఘవేందర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు.


 

click me!