ప్రతి దాంట్లో జోక్యం.. ఎదుగుదలకు అడ్డు: వామన్‌రావు దంపతుల హత్యకు కారణాలివే..!!

By Siva KodatiFirst Published Feb 18, 2021, 8:56 PM IST
Highlights

లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రామగుండం ఐజీ తెలిపారు. గురువారం సాయంత్రం నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంట శ్రీనివాస్‌, చిరంజీవితో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రామగుండం ఐజీ తెలిపారు. గురువారం సాయంత్రం నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంట శ్రీనివాస్‌, చిరంజీవితో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గుడి వివాదమే హత్య దారి తీసిందని వెల్లడించారు. స్వగ్రామంలో వామన్ రావు దంపతులు నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి కారణంగానే హత్యలు జరిగినట్లు ఐజీ చెప్పారు. అక్కపాక కుమార్ ఇచ్చిన సమాచారంతో వామన్‌రావును వెంబడించారని.. బ్రీజా కారుతో ఆయన కారును ఢీకొట్టారని ఆయన పేర్కొన్నారు.

ముందుగా నాగమణిపై కత్తులతో దాడి చేశారని.. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. వామనరావుపై చిరంజీవి, శ్రీనివాస్‌ కలిసి ఏకకాలంలో దాడి చేశారని పోలీసులు వివరించారు.

దాడి తర్వాత నిందితులు సుందిళ్ల బ్యారేజ్‌ వైపు పారిపోయారని.. అనంతరం రక్తం మరకలు వున్న బట్టలను బ్యారేజ్‌లో పడేశారని చెప్పారు. అనంతరం అక్కడ బట్టలు మార్చుకుని మహారాష్ట్ర వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు.

Also Read:వామన్‌రావు దంపతుల హత్య: ముగ్గురి అరెస్ట్

తన ప్రతి విషయంలో వామన్ రావు అడ్డుపడుతున్నాడని శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడని..కొత్త , పాత వివాదాలతో వామన్ రావు దంపతులను మట్టుబెట్టాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. బిట్టు శ్రీను సహకారంతో వామన్ రావు హత్యకు కుట్ర పన్నాడు.

గతంలో 4 కేసుల్లో కుంట శ్రీనివాస్ నిందితుడిగా వున్నాడని పోలీసులు వెల్లడించారు. 1997లో సికాసలో పనిచేసిన కుంట శ్రీనివాస్.. బస్సును తగులబెట్టిన కేసులో కూడా నిందితుడని పేర్కొన్నారు. పలు బెదిరింపులు, భార్యను వేధించిన కేసుల్లో శ్రీనివాస్ నిందితుడని పోలీసులు చెప్పారు. 

దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు, డిజిటల్ , సోషల్ మీడియా, ఇతర సాక్ష్యాలు కేసును పూర్తి చేస్తామని ఐజీ తెలిపారు. ఈ జంట హత్య కేసుల్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్నా, ఎంతటి వారినైనా వదలమని ఆయన స్పష్టం చేశారు. 

click me!