నేడు ఐదుగురే..రేపు 65 మంది: రాంమాధవ్ జోస్యం

Published : Oct 13, 2018, 05:02 PM IST
నేడు ఐదుగురే..రేపు 65 మంది: రాంమాధవ్ జోస్యం

సారాంశం

తెలంగాణలో బీజేపీ 65 స్థానాల్లో విజయం సాధిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఐదుగురే బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు కానీ రేపు 65 ఎమ్మెల్యేలవుతారని జోస్యం చెప్పారు. శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి హాజరైన రాం మాధవ్ అధికార, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ 65 స్థానాల్లో విజయం సాధిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఐదుగురే బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు కానీ రేపు 65 ఎమ్మెల్యేలవుతారని జోస్యం చెప్పారు. శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి హాజరైన రాం మాధవ్ అధికార, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో మతతత్వ, అవినీతి, రాచరిక, రాక్షస పాలన కొనసాగుతుందని దాన్ని అంతం చేయాలని కోరారు. 

అవినీతి రహిత, కుంటుంబ పాలన లేని సుపరిపాలన కోరే వారందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీగా ఉన్న తమకు అధికారం అప్పగించండి అని అనడానికి సంకోచంగా ఉండొచ్చని కానీ కురుక్షేత్ర మహా సంగ్రామంలో పంచ పాండవులే గెలిచారని చెప్పారు.

 అస్సాంలో కూడా అధికారంలోకి రాకముందు బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని అయినా ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ గత నాలుగున్నరేళ్లలో 15 రాష్ట్రాల్లో గెలిచిందని గుర్తు చేశారు. 

కాంగ్రెస్‌ కూటమిలో తెలుగు ద్రోహుల పార్టీ కూడా ఉందని ఎద్దేవా చేశారు. దివంగత ఎన్టీఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెడితే, ప్రస్తుత నాయకులు వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. అందుకే ఆ పార్టీ తెలుగు ద్రోహుల పార్టీగా మారిందన్నారు. ఇక కేం‍ద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చురకలు అంటించారు. 

తెలంగాణకు బీజేపీ మాత్రమే సహజమైన పార్టీ అని అభిప్రాయపడ్డారు. ఇవాళ ఐదుగురు ఎమ్మెల్యేలే కావచ్చు కానీ రేపు 65 మంది ఎమ్మెల్యేలు అవుతారన్నారు. మోదీ కేబినెట్‌లో దేశ గౌరవమైన పోస్టుల్లో ఇద్దరు మహిళా మంత్రులున్నారని కానీ తెలంగాణలో మహిళల స్థానం ఏంటని ప్రశ్నించారు. 

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీలేని ప్రభుత్వం ఉండకూడదని రాంమాధవ్ అభిప్రాయపడ్డారు. ఐదేళ్లు పాలన చెయ్యలేక దివాళ తీసిన టీఆర్ఎస్‌ పార్టీకి మళ్లీ పరిపాలించే హక్కు ఉందా అంటూ రాంమాధవ్‌ ప్రశ్నించారు.   

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది