బిజెపి మేనిపెస్టోలో ముఖ్యమైన అంశాలివే... కమిటీ ఛైర్మన్ ప్రభాకర్

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 4:46 PM IST
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండంతో పార్టీలన్ని వేగాన్ని పెంచాయి. అభ్యర్థుల కసరత్తు, పొత్తులు, ప్రజలకిచ్చే హామీలు ఇలా వివిధ అంశాలు తుది దశకు చేరుకున్నాయి. ఇలా బిజెపి పార్టీ కూడా ప్రజలకిచ్చే హామీలపై మేనిపెస్టో రూపొందించడానికి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తెలిపారు.  ప్రభాకర్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 
 
బిజెపి పార్టీ మేనిపెస్టోలోని అంశాల గురించి ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడారు. ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న మధ్య పానం అమ్మకాలపై ఆంక్షలు విధించనున్నట్లు ఆయన తెలిపారు. వైన్స్ లతో పాటు బార్లలో కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత మధ్యం అమ్మకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అలాగే దేవాదాయ భూములతో పాటు వక్ఫ్, క్రైస్తవ చర్చీల భూముల పరిరక్షణకు ప్రత్యేక టాస్క ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే అయ్యప్ప, హనుమాన్, శివ, అమ్మవారి మాలదారులకు దీక్ష ముగింపు సందర్భంగా దేవాలయాలకు వెళ్లడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అందుకోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభాకర్ తెలిపారు.

ఇక ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా సుంకాలు వేస్తున్నాయని ఆయన తెలిపారు. కాబట్టి అధికారంలోకి రాగానే ఆ సుంకాలను ఎత్తివేస్తామన్నారు. ముఖ్యంగా అత్యధికంగా వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభాకర్ హామీ ఇచ్చారు. 

click me!