అమీన్‌పూర్ లో వివాహితతో టీఆర్ఎస్ నేత రాసలీలలు: రికార్డు చేసిన వివాహిత భర్త, బెదిరింపులు

Published : Sep 28, 2022, 01:36 PM IST
అమీన్‌పూర్ లో వివాహితతో టీఆర్ఎస్ నేత రాసలీలలు: రికార్డు చేసిన వివాహిత భర్త, బెదిరింపులు

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత శిఖామణిపై రాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత శిఖామణి పై రాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహేతర సంబంధం విషయమై ప్రశ్నించిన తనను శిఖామణి బెదిరించాడని రాజు  చెబుతున్నాడు. . ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అమీన్ పూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత శిఖామణి తన సమీప బంధువు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన వివాహిత భర్త  తన సెల్ ఫోన్ లో ఈ దృశ్యాలను రికార్డు చేశాడు.   ఇది తెలుసుకున్న  శిఖామణి  వివాహిత భర్త రాజును  బెదిరించి ఈ దృశ్యాలను డిలీట్ చేయించాడు.ఈ విషయమై  రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కిడ్నాప్ చేసి ఈ వీడియోలను డిలీట్ చేసినట్టుగా రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్  చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్