రేపు పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ భేటీ: పాల్గొననున్న రాజాసింగ్

By narsimha lode  |  First Published Sep 28, 2022, 12:44 PM IST

పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీసమావేశం రేపు జరగనుంది.ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ పాల్గొంటారు. 


హైదరాబాద్: పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈ నెల 29వ తేదీన  జరగనుంది. ఈ సమావేశంలో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొంటారు.  గత నెల 25వ తేదీ నుండి రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.  పీడీ యాక్ట్ కింద రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

2004 నుండి రాజాసింగ్ పై సుమారు 100కి పైగా కేసులు నమోదయ్యాయి.దీంతో రాజాసింగ్ పై హైద్రాబాద్ పోలీసులు ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు గత నెల 25న తరలించారు. అంతకు రెండు రోజుల ముందే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే  అదే రోజున నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 22వ తేదీన రాజాసింగ్  యూట్యూబ్ లో ఒక వీడియోను అప్ లోడ్ చేశారు.ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది.ఈ విషయమై ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు నిర్వహించారు.ఈ ఆందోళనల నేపథ్యంలో ఈ వీడియోను తొలగించాలని యూట్యూబ్ కు హద్రాబాద్ పోలీసులు లేఖ రాశారు.ఈ లేఖ ఆధారంగా ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది.

Latest Videos

also read:చర్లపల్లి సెంట్రల్ జైలు సిబ్బందిపై రాజాసింగ్ భార్య తీవ్ర ఆరోపణలు..

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున బీజేపీ నుండి రాజాసింగ్ నుండి సస్పెండ్ చేశారు. అంతేకాదు పార్టీకి చెందిన అన్ని పదవుల నుండి ఆయనను తొలగించారు. ఈ మేరకు పార్టీ  ఆయన కు నోటీసులు జారీ చేసింది. 15  రోజుల్లోనే వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను ఆదేశించింది. అయితే ఈ లోపుగానే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు పోలీసులు. ఇదే విషయాన్ని రాజాసింగ్ కుటుంబ సభ్యులు పార్టీకి సమాచారం ఇచ్చారు.

రాజాసింగ్ పై  పీడీ యాక్ట్ ను  ప్రయోగించడంపై ఆయన భార్య ఉషాబాయి  హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించారని ఆమె ఆరోపించారు.  మరో వైపు ఈ నెల 18న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో  ఉషాబాయి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఈ కేసులు నమోదు చేస్తున్నారని గవర్నర్ కు ఆమె ఫిర్యాదు చేశారు. చర్లపల్లి జైలులో తన భర్తకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని రాజాసింగ్ భార్య హైకోర్టులో ఈ నెల 22న పిటిషన్ దాఖలు చేశారు.

click me!