రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం:34 మందిపై సస్పెన్షన్ వేటు

By narsimha lode  |  First Published Nov 1, 2022, 11:15 AM IST

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో గల వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన 34 మంది విద్యార్ధులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండు వారాల పాటు  సస్పెండ్  చేసింది.
 


హైదరాబాద్:రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో గల వెటర్నరీ యూనివర్శిటీలో  ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. ర్యాగింగ్ కు గురైన విద్యార్ధులు  రాత పూర్వకంగా   ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 34 మంది విద్యార్థులపై వీసీ  చర్యలు తీసుకున్నారు. 

రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్శిటీలో సీనియర్లు జూనియర్ విద్యార్ధులపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు.ఈ విషయమై జూనియర్ విద్యార్ధులు ఈ విషయమై లేఖ రాసి ఫిర్యాదుల బాక్సులో వేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా సీనియర్ విద్యార్ధులు 34 మందిని రెండు వారాల పాటు సస్పెండ్  చేశారు. గతంలో ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపాల్ తో ఇతర ప్రొఫెసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫిర్యాదుల బాక్సులో విద్యార్ధులు  తమ  ఫిర్యాదులను వేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన వీసీ ర్యాగింగ్ కు పాల్పడిన 34 మంది  సీనియర్లపై  చర్యలు తీసుకుంది. 

Latest Videos

click me!