ఈదురుగాలులు, పిడుగులతో హైదరాబాద్‌లో భారీ వర్షం .. ప్రజలు అప్రమత్తంగా వుండాలన్న ఐఎండీ

Siva Kodati |  
Published : Apr 25, 2023, 08:02 PM ISTUpdated : Apr 25, 2023, 08:05 PM IST
ఈదురుగాలులు, పిడుగులతో హైదరాబాద్‌లో భారీ వర్షం .. ప్రజలు అప్రమత్తంగా వుండాలన్న ఐఎండీ

సారాంశం

హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.  భారీ ఈదురుగాలులకు తోడు , పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచే నగరంలో మేఘావృతమై వుండగా.. ఆ తర్వాత వరుణుడు విరుచుకుపడ్డాడు. భారీ ఈదురుగాలులకు తోడు , పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాబోయే కొద్దిగంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం వుందని.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ తెలిపింది. 

కాగా.. దేశంలోని అనేక చోట్ల సోమవారం అకాల వర్షాలు కురిశాయి. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు దంచికొట్టాయి. పలు చోట్ల ఈ గాలి వానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షాలకు పంటలు నాశనం అయ్యాయి. కాగా.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో నలుగురు చనిపోయారు.

ALso Read: అకాల వర్షాలు.. తెలంగాణ సరిహద్దుల్లో పిడుగు పడి నలుగురి మృతి

వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం అకాల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీశాయి. ఇదే సమయంలో వడ్సా మండలం అమ్ వావ్ కు గ్రామానికి చెందిన భరత్ రాజ్ గడె తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నాడు. ఆయన సోమవారం ఉదయం కురకేడ మండలంలో ఉదయం పూట జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరై.. తిరిగి అమ్ వాడకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా వర్షం మొదలైంది.

భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో బైక్ ముందుకు కదలడం కష్టంగా మారింది. దీంతో తన భార్య, పిల్లలతో కలిసి ఆయన ఓ చెట్టు కిందకు వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ఆ చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఆ నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే మరణించారు. ఈ ఘటనతో అమ్ వావ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?
Bullet Train లో హైదరాబాద్ నుండి అమరావతి, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై కి... ఎంతసేపట్లో చేరుకోవచ్చో తెలుసా..?