నారాయణ్ పేట్ జిల్లా మద్దూరులో జిల్లాపరిషత్ బాలిక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
నారాయణపేట్ : గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపేట్ జిల్లా మద్దూరులోని జిల్లాపరిషత్ బాలిక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పాత భవనం కావడంతో వర్షాలకు నాకి కూలిపోయింది. అయితే, పాఠశాలకు సెలవు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, పాత స్కూలు భవానాలన్నింటినీ మరమ్మత్తులు చేయించాలని.. విద్యార్థి సంఘాు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.