సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్ కు 64 మొబైల్స్

By narsimha lode  |  First Published Aug 11, 2022, 10:45 AM IST

అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో 64 స్మార్ట్ ఫోన్లను పోలీసులు పోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. 


హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ ను నిరసిస్తూ విధ్వంసం చేసిన ఆర్మీ అభ్యర్ధులకు చెందిన  సుమారు 64 స్మార్ట్ ఫోన్లను రైల్వే పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు.

అగ్నిపథ్ స్కీమ్ ను నిరసిస్తూ ఈ ఏడాది జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి దిగారు. ఈ స్కీమ్ ను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన అభ్యర్ధులు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో కొందరు ఇప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ విధ్వంసం వెనుక కొన్ని రైల్వే రిక్రూట్ మెంట్ కు చెందిన కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని రైల్వే పోలీసులు గతంలో ప్రకటించారు.ఈ మేరకు  రైల్వే కోచింగ్ సెంటర్లకు చెందిన కీలక సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos

undefined

ఈ విధ్వంసం వెనుక వాట్సాప్ గ్రూపులు కీలకంగా వ్యవహరించాయని కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లోనే విధ్వంసానికి ప్లాన్ చేశారని గుర్తించారు.ఈ వాట్సాప్ గ్రూపుల ఆడ్మిన్లతో పాటు గ్రూపు సభ్యులను కూడా పోలీసులు  దర్యాప్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లోని సుమారు 400 మంది నుండి  పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో రైల్వే పోలీసులు చార్జీషీట్ ను దాఖలు చేయనున్నారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఏడాది జూన్ 17న అగ్నిపథ్ స్కీమ్ ను నిరసిస్తూ ఆందోఁళన కారులు చేపట్టిన విధ్వంసాన్ని  అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ తో పాటు కాల్పులకు కూడా దిగారు.పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. మరో వైపు ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు.  గాయపడిన వారిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్న హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా  మరో  రైల్ కు కూడా ఆందోళన కారులు ఆరోజు నిప్పంటించారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్  లో   రైలు పట్టాలపై కూర్చొని ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను సాయంత్రం వరకు రైల్వే స్టేషన్ నుండి బయటకు పంపించారు పోలీసులు పట్టాలపై నిలబడి ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ ఆందోళన చేసి అరెస్టైన ఆర్మీ అభ్యర్ధులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అరెస్టైన వారిని న్యాయ సహాయం కూడా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 
 

click me!