మైనర్ బాలికల అక్రమ రవాణా... నగరంలో కలకలం

Published : Jul 20, 2019, 10:50 AM IST
మైనర్ బాలికల అక్రమ రవాణా... నగరంలో కలకలం

సారాంశం

జార్ఖండ్ రాష్ట్రం నుంచి దాదాపు 14నుంచి 17ఏళ్ల వయసుగల ఆరుగురు మైనర్ బాలికలను నితీష్ ముండా అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

మైనర్ బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న సంఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది.  బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని మల్కాజ్ గిరి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్ రాష్ట్రం నుంచి దాదాపు 14నుంచి 17ఏళ్ల వయసుగల ఆరుగురు మైనర్ బాలికలను నితీష్ ముండా అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

పక్కా సమాచారంతో నిందితుడిని మల్కాజిగిరి రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నితీష్ ముండా బాచుపల్లిలోని ఏజి బయోటెక్ ల్యాబరేటరీలో సూపర్ వైజర్ గా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ