తప్పిన ప్రమాదం: ఫలక్‌నుమాలో రైల్వేట్రాక్ కింద కుంగిన భూమి

Published : Aug 19, 2020, 03:55 PM ISTUpdated : Aug 19, 2020, 05:30 PM IST
తప్పిన ప్రమాదం: ఫలక్‌నుమాలో రైల్వేట్రాక్ కింద కుంగిన భూమి

సారాంశం

హైద్రాబాద్ పాతబస్తీలో  రైల్వే గార్డు సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది.  రైల్వేగార్డు సమాచారంతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.


హైదరాబాద్: హైద్రాబాద్ పాతబస్తీలో  రైల్వే గార్డు సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది.  రైల్వేగార్డు సమాచారంతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

భారీ వర్షాలకు ఫలక్‌నుమా రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి కింద ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ ట్రాక్ పై సుమారు ఐదు ప్రాంతాల్లో ఇదే తరహాలో భూమి కుంగిపోయింది.  ఇదే ట్రాక్ పై మరో ఐదు నిమిషాల్లో గూడ్స్ రైలు వెళ్లేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన గార్డు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైళ్ల రాకపోకలను మళ్లించారు.

ఈ ట్రాక్ పై గొయ్యి ఏర్పడిన సమయంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు నడవలేదు. ఒకవేళ ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు సాగితే ప్రమాదం జరిగేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 8 మీటర్ల వెడల్పుతో భూమి కుంగిపోయింది.  ట్రాక్ కింద భూమి కుంగిన ప్రాంతం నుండి నీళ్లు వస్తున్నాయి. 

ఈ ప్రాంతంలో అధికారులు గొయ్యి వద్ద మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా ఏయే ప్రాంతాల్లో భూమి కుంగిపోయిందా అనే  విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల వల్లే భూమి కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ