వచ్చే వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన

Published : Oct 05, 2023, 02:00 PM IST
వచ్చే వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన

సారాంశం

రాహుల్ గాంధీ వచ్చే వారంలో తెలంగాణకు రాబోతున్నారు. ఈ నెల రెండో వారంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మూడు రోజులపాటు ఆయన పర్యటించబోతున్నారు. టీ కాంగ్రెస్ ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నది.  

హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు ఆయన తెలంగాణ రాష్ట్ర పర్యటనలో ఉండబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి తెలంంగాణ కాంగ్రెస్ యూనిట్ కసరత్తులు చేస్తున్నది. ఆయన పర్యటనా కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నది.

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ దక్షిణాదిలోని మరో రాష్ట్రం తెలంగాణలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నది. మొత్తం ఫోకస్ తెలంగాణపై పెట్టింది. తరుచూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. టీ కాంగ్రెస్‌లో జోష్‌ను నింపే ప్రయత్నం చేస్తున్నది. వరుస భారీ సభలతో లీడర్,క్యాడర్‌లలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.

కొత్త సీడబ్ల్యూసీ తొలి సమావేశానికి వేదికగా తెలంగాణ రాష్ట్రాన్నే కాంగ్రెస్ ఎంచుకుంది. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకుంది. అలాగే.. కాంగ్రెస్ విజయభేరి సభ కూడా నిర్వహించింది. ఈ సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. రంగారెడ్డి తుక్కుగూడలో జరిగిన ఈ సభతో పార్టీలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆరు హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

త్వరలోనే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్నది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. బీజేపీ కూడా ఈ నెలలో విరివిగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించుకుంది. ఈ నెలలో సుమారు 30 నుంచి 40 సభలను నిర్వహించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలను కూడా తెలంగాణకు రప్పించే ఆలోచనలు చేస్తున్నది.

Also Read: కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందాా...! కాంగ్రెస్ లోకి వలసలు... రేవంత్ తో మరో కీలక నేత భేటీ

కాగా, బీఆర్ఎస్ కొత్త పంథాలో వెళ్లుతున్నది. చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారిని పరుగులు పెట్టిస్తున్నది. ఒక రకంగా ఇది వారికో లిట్మస్ పరీక్షగా మారిపోయింది. ఇవే తుది నిర్ణయాలు కావని, సరైన ప్రదర్శన లేని అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం కూడా ఉండటంతో బీఆర్ఎస్‌లో ప్రకటించిన అభ్యర్థులతోపాటు ఇంకా ఆశావాహంగా ఉన్న నేతలూ దూకుడు మీద ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రచారంపైనా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...