రాహుల్ గాంధీ భ్రమలో జీవిస్తున్నారు.. కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

Published : Oct 11, 2023, 11:39 AM IST
రాహుల్ గాంధీ భ్రమలో జీవిస్తున్నారు.. కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

సారాంశం

Nizamabad: 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కుల గణన ఎందుకు చేపట్టలేదని కాంగ్రెస్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ లీడ‌ర్, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. కేంద్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండింటినీ తప్పుబట్టారు. 

BRS MLC Kalvakuntla Kavitha: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ లీడ‌ర్ రాహుల్ గాంధీని టార్గెట్  చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కుల గణన ఎందుకు చేపట్టలేదని కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. కేంద్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండింటినీ తప్పుబట్టారు. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో బీసీ వర్గాలకు చట్టసభల్లో మూడింట ఒక వంతు (33%) రిజర్వేషన్లు కల్పించాలనీ, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధంగా మద్దతు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రాహుల్ గాంధీ భ్రమలో బతుకుతున్నారన్నారు. 'తెలంగాణలో తాము అధికారంలోకి వస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మీరు వారి కోసం పనిచేస్తేనే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి అధికారంలోకి వస్తారు' అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తోందని క‌విత‌ కొనియాడారు. ''తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తోంది. కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉన్నా కేంద్ర స్థాయిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేయలేదు. గత పదేళ్లుగా ఇదే తమ డిమాండ్'' అని చెప్పారు. వెనుకబడిన తరగతుల జనాభా గణన గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆమె అన్నారు.

"ఇప్పుడు హఠాత్తుగా ఆ పని చెయ్యాలని గుర్తుచేసుకుంటున్నారు. ఈ రెండింటినీ పదేళ్ల క్రితమే చేపట్టింది బీఆర్ఎస్... దేశంలో వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు'' అని అన్నారు. రాహుల్ గాంధీ ఈ భ్రమ నుంచి బయటపడి వెనుకబడిన తరగతుల గురించి మాట్లాడటం మానేస్తారని ఆశిస్తున్నానని ఆమె అన్నారు. తెలంగాణ సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాబోతోందని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, నవంబర్ 17న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkaiah Naidu Attends Sankranti: వెంకయ్య నాయుడుకి మోకాళ్ళ పై దండం పెట్టిన ఎద్దు | Asianet Telugu
Warangal RTC Special Arrangements: సంక్రాంతి సందర్బంగా కిటకిట లాడిన బస్టాండ్ లు| Asianet News Telugu