తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దూకుడు: అసంతృప్తుల బుజ్జగింపులకు జానారెడ్డి నేతృత్వంలో కమిటీ

By narsimha lode  |  First Published Oct 11, 2023, 10:11 AM IST

టిక్కెట్లు దక్కనివారిని బుజ్జగించేందుకు  జానారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది  కాంగ్రెస్. ఈ కమిటీ ఇవాళ  గాంధీ భవన్ లో సమావేశం కానుంది. 
Congress  Appoints  Jana Reddy Committee For Telangana Assembly Elections 2023


హైదరాబాద్: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగానే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాత  ఏర్పడే అసంతృప్తిని చల్లార్చేందుకు  జానారెడ్డి నేతృత్వంలో  నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. జానారెడ్డి నేతృత్వంలోని ఫోర్ మెన్ కమిటీ ఇవాళ గాంధీ భవన్ లో సమావేశం కానుంది. ఈ కమిటీలో జానారెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రే,  దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

అభ్యర్థుల ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ  కసరత్తు కొనసాగుతుంది.  సుమారు వంద మంది అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రచారం సాగుతుంది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదనే  ప్రచారం కూడ లేకపోలేదు. ఈ కారణంగానే  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే  ప్రచారం  కాంగ్రెస్ వర్గాల్లో సాగుతుంది.

Latest Videos

undefined

 తొలుత ఈ నెల  15 నాటికే అభ్యర్థుల ప్రకటన చేయాలని భావించారు. కానీ అభ్యర్థుల జాబితాపై  నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా  అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు యాత్ర తర్వాతే  అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా  రెండు దఫాలు అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. అయితే  ఈ దఫా మాత్రం అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది.   కర్ణాటకలో అనుసరించిన వ్యూహాంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది.  టిక్కెట్ల కోసం  వెయ్యి మందికిపై ధరఖాస్తులు అందాయి.  అయితే  గెలిచే అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

also read:కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం: బస్సు యాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన

దీంతో  టిక్కెట్టు రాని అభ్యర్థులను బుజ్జగించేందుకు జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ  పరిస్థితులను చక్కబెట్టనుంది.  టిక్కెట్లు దక్కని నేతలను పిలిపించుకుని బుజ్జగించనుంది.  ఏ కారణాల చేత  టిక్కెట్లు కేటాయించలేదో వివరించనున్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే  టిక్కెట్లు దక్కని వారికి ఏ రకంగా న్యాయం చేస్తామో కూడ  జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ  హామీలు ఇవ్వనుంది.

click me!