Revanth Reddy: కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

Published : Jan 03, 2022, 09:03 AM ISTUpdated : Jan 03, 2022, 09:04 AM IST
Revanth Reddy:  కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

సారాంశం

Revanth Reddy:  రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీని బారిన‌ప‌డుతున్న ప్ర‌ముఖుల సంఖ్య పెరుగుతున్న‌ది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డికి క‌రోనా వైర‌స్ సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.   

Revanth Reddy:  రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీని బారిన‌ప‌డుతున్న ప్ర‌ముఖుల సంఖ్య పెరుగుతున్న‌ది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డికి క‌రోనా వైర‌స్ సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. "నాకు కరోనా వైరస్ సోకింది. తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజటివ్ గా వచ్చింది. ఇటీవల నన్ను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. తగిన జాగ్రత్తలు తీసుకొండి" అంటూ ట్వీట్ చేశారు.  దీంతో ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో కలవరం మొదలైంది. రేవంత్ రెడ్డిని కలిసిన నాయకులు, కార్యకర్తలు కరోనా పరీక్షలు  చేయించుకోవడానికి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు
Sankranti : సంక్రాంతికి ఈ గుడికి వెళ్తే మీ జాతకం మారిపోవడం ఖాయం ! పట్టిందల్లా బంగారమే!