
మెట్‌పల్లి: జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం వేంపేటలో పాత కక్షలతో తండ్రీ కొడుకులపై రఘుసుందర్ అనే వ్యక్తి కత్తితో దాడికి దిగాడు.ఈ ఘటనలో చిన్నరాజం మృతి చెందగా అతను కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరో వైపు రాజంపై కత్తితో దాడి చేసిన రఘుసుందర్ పై రాజం బంధువులు దాడి చేశారు. దీంతో రఘుసుందర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ణి కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.