KTR: తండ్రికి తగ్గ తనయుడు.. కేటీఆర్ రాజకీయ ప్రస్థానం ఇది..

By Rajesh KarampooriFirst Published Dec 3, 2023, 1:36 AM IST
Highlights

KTR: రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగిన కేటీఆర్.. తొలుత ఉన్నత చదువులు ఉద్యోగాలు అంటూ విదేశాల బాటపట్టాడు. ఆ తర్వాత కాలంలో తన తండ్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి పొంది.. విదేశాల్లో హై ప్రొఫైల్ ఉద్యోగానికి స్వస్తి పలికాడు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన వెనుకే ఉంటూ.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పుడూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యోమంలో.. ఇప్పుడూ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు ఫుల్ బయోగ్రఫీ మీకోసం..  

KTR: గులాబీ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టాడు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్). బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. అతి తక్కువ సమయంలో తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ, వాణిజ్య, గ‌నులు, ప్రజా వ్యవ‌హారాలు, ప్రవాసుల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు ఫుల్ బయోగ్రఫీ మీకోసం..

తారక రామారావు (కేటీఆర్) 1976 జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో జన్మించారు. రామారావు పాఠశాల విద్య హైదరాబాద్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో జరిగింది. ఆ తర్వాత 1993లో గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చి మెడిసిన్ ఎంట్రన్స్ రాయిగా రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ, అక్కడికి వెళ్లి చదవడం ఇష్టం లేక నిజం కాలేజీలో మైక్రో బయాలజీలో డిగ్రీలో చేరారు.

గ్రాడ్యుయేషన్ అయిపోయాక 1996లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముంబైలోని పూణే యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కేటీఆర్.. సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో 1998-2000 లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ఇంటర్ ప్రైవేట్ కంపెనీలు ఐదేళ్లపాటు ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగం చేశారు. అతి తక్కువ సమయంలోనే రీజినల్ డైరెక్టర్ గా కూడా పదోన్నతి పొందారు. తర్వాత 2003లో షమీలిని వివాహం చేసుకున్నాడు.రామరావు-షమీల దంపతులకు ఇద్దరు సంతానం.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగమయేందుకు అమెరికాలోని ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2004లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలలో తన తండ్రి కేసీఆర్  గెలుపు కోసం కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. ప్రచార బాధ్యతలు తనపై వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గెలుపొందారు. ఇలా పార్టీ నేతలకు దగ్గరయ్యారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. ఈ తరుణంలో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తను తొలిసారిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన కేకే మహేందర్ రెడ్డి పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీలో  తొలిసారి అడుగు పెట్టాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం కీలకంగా వ్యవహరిస్తూ.. తెలంగాణ ప్రజానీకం తరుపున తన గొంతుకను అసెంబ్లీ వినిపించారు. ఈ తరుణంలో ఎన్నో ఉద్యమ పోరాటం కీలకంగా వ్యవహరించారు. ఇలా తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పై 68,219 ఓట్ల భారీ మెజారిటీతో రెండోసారి గెలుపొందాడు. ఆ తరువాత ఆయన చేసిన పలు ధర్నాలకు,రాస్తారోకోలకు గాను చాలాసార్లు అరెస్టయ్యారు.ఇక తెలంగాణ ఆవిర్భావం అయ్యాక జరిగిన భారత యూనియన్ యొక్క 29వ రాష్ట్రమైన తెలంగాణకు మొదటి శాసనసభ ఎన్నికలు 30 ఏప్రిల్ 2014న జరిగాయి .ఈ ఎన్నికల్లో తారకరామారావు సిరిసిల్ల నుండి టిఆర్ఎస్ తరఫున కొండూరి రవీందర్రావు పై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి వరుసగా మూడోసారి గెలుపొందాడు.

ఇక ఆ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 66 సీట్లు కైవసం చేసుకొని టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో అతిపెద్ద మెజారిటీతో అధికార పార్టీగా అవతరించింది. 2014 జూన్ 2న  రామారావు తెలంగాణ శాసనసభ్యునిగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ పంచాయతీరాజ్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే.. కేటీఆర్ గత మంత్రి వర్గంలో ఐటీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ తో సహా అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నిక సమయంలో పార్టీ ప్రచారంలో కీలకపాత్ర పోషించడం మొదలుపెట్టాడు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలు పర్యటనలు నిర్వహించడమే కాకుండా పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలో అసమతిని పరిష్కరించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెరాస పార్టీ అధ్యక్షుడు అయినా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అలాగే తాను మంత్రిగా ఉన్న శాఖలు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ తనతైన ముద్ర వేసుకుంటున్నాడు. అంతేగాక అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా 2015 సంవత్సరంలో మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ అఫ్ ది ఇయర్గా కూడా గుర్తింపు పొందాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్‌ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంతో.. అలుపెరగని ప్రచారం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రచారం పూర్తియ్యే చివరి నిమిషం వరకు ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు.  

click me!