కాకతీయ యూనివర్సిటీలో ర్యాంగింగ్ కలకలం.. 81మంది విద్యార్థినులు సస్పెన్షన్..

Published : Dec 23, 2023, 11:36 AM IST
కాకతీయ యూనివర్సిటీలో ర్యాంగింగ్ కలకలం.. 81మంది విద్యార్థినులు సస్పెన్షన్..

సారాంశం

యూనివర్సిటీ చరిత్రలోనే ఏకంగా ఒకేసారి 81 మందిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి.

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కు పాల్పడుతున్న విద్యార్థినిలను పెద్ద ఎత్తున సస్పెండ్ చేశారు. పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవిద్యార్థినిలు పద్మావతి మహిళా వసతిగృహంలో జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం వెలుగు చూడడంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఏకంగా కామర్స్, ఎకనామిక్స్, జువాలజీల్లో పీజీ చేస్తున్న మొత్తం 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ కొరడా ఝుళిపించారు. వీరిలో 28 మంది పీజీ విద్యార్థినిలు ఉండగా, 28 మంది కామర్స్, 25 మంది ఎకనామిక్స్, జువాలజీ సెకండియర్ విద్యార్థినిలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

లేడీస్ హాస్టల్ లో ర్యాగింగ్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలేజీకి కొత్తగా వచ్చే విద్యార్థినులకు భయం పోగొట్టి పరిచయం పెంచుకునే క్రమంలో ర్యాగింగ్ చేస్తుంటారు. ఇది క్రమేణా మితిమీరి తీవ్ర రూపం దాల్చింది. దీంతో ప్రభుత్వం కాలేజీల్లో ర్యాగింగ్ నిషేధించింది. అయితే, కాకతీయ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థినులపై సీనియర్  అమ్మాయిలు ర్యాగింగ్ కు పాల్పడడం ఇప్పుడు కలకలం రేపింది.  యూనివర్సిటీ చరిత్రలోనే ఏకంగా ఒకేసారి 81 మందిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి.

బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ విడుదల రేపటికి వాయిదా..

గత కొద్ది రోజులుగా యూనివర్సిటీ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు అధికారులకు సమాచారం అందడంతో కఠిన చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పద్మావతి మహిళా వసతి గృహంలో ఉన్న విద్యార్థుల దగ్గర వివరాలు సేకరించిన తర్వాత కాలేజీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మిగతా విభాగాల్లో కూడా ర్యాగింగ్ పాల్పడ్డారా?  ఎంతమంది ర్యాగింగ్ పాల్పడ్డారు? అనే వివరాలను వర్సిటీ అధికారులు సేకరిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఆధారాలు దొరికితే సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. ఈ రోజు నుంచి డిసెంబర్ ఒకటి వరకు కాకతీయ యూనివర్సిటీకి క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు వెంటనే హాస్టల్స్ ఖాళీ చేయాలని అధికారులు తెలిపారు. ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu