మందేసి చిందేసిన యువతీయువకులు: పోలీసుల అదుపులో90 మంది

Published : Mar 12, 2021, 08:36 AM ISTUpdated : Mar 12, 2021, 09:03 AM IST
మందేసి చిందేసిన యువతీయువకులు: పోలీసుల అదుపులో90 మంది

సారాంశం

నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లో వంద మంది యువతీయువకులు మందేసి చిందేస్తూ పోలీసులకు చిక్కారు. రేవ్ పార్టీపై రాచకొండ పోలీసులు దాడి చేసి 90 మందిని అదుపులోకి తీసుకున్నారు.

నల్లొండ: రాచకొండ పోలీసులు ఓ రేవ్ పార్టీపై దాడి చేసి 90 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లో రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. శుక్రవారం తెల్లవారు జామున ఆ దాడి చేసి యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.

మందు సేవిస్తూ చిందులేస్తూ యువతీయువకులు నానా యాగీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసభ్యకరమైన రీతిలో వ్యవహరించారని కూడా అంటున్నారు. పోలీసులు 90 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. మరో పది మంది పారిపోయినట్లు తెలుస్తోంది. 

పోలీసులకు సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కనిపించాయి. యువతీయువకుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వారంతా హైదరాబాదు నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు 60 ద్విచక్రవాహనాలను, 20 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

రియల్టర్ ధన్వంతరెడ్డి, ఆయన కుమారుడు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో వారు ధన్వంతరెడ్డి కుమారుడిని ప్రశ్నిస్తున్నారు.

ఈ సంఘటనపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అందించే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు