హైద్రాబాద్ పహాడీ షరీఫ్ లో కాల్పుల కలకలం: అంతరాష్ట్ర దోపీడీ ముఠా అరెస్ట్

Published : Feb 22, 2022, 10:43 AM ISTUpdated : Feb 22, 2022, 11:04 AM IST
హైద్రాబాద్ పహాడీ షరీఫ్ లో కాల్పుల కలకలం: అంతరాష్ట్ర దోపీడీ ముఠా అరెస్ట్

సారాంశం

హైద్రాబాద్ పహాడీ షరీఫ్ లో లారీ డ్రైవర్ పై కాల్పులకు దిగి టైర్ల లోడుతో ఉన్న లారీని అపహరించిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్: హైద్రాబాద్ pahadi shareefలో లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపి  దోపీడీకి పాల్పడిన ముఠాను Rachakonda పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.  నిందితులు  Inter-State Burglary Gangగా పోలీసులు తెలిపారు.

Tyre లోడుతో వస్తున్న లారీ Driver పై దుండగులు weaponతో కాల్పులు జరిపారు. దీంతో లారీ డ్రైవర్ భయపడ్డాడు. డ్రైవర్ సహా లారీని దుండగులు అపహారించారు. గోడౌన్‌లో Lorryలోని టైర్లను అన్‌లోడ్ చేసుకొన్నారు. ఆ తర్వాత లారీ సహా డ్రైవర్ ను వదిలి పెట్టారు.  

ఈ విషయమై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.  సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు . నిందితులు అంతరాష్ట్ర దారి దోపీడీ ముఠాగా పోలీసులు ప్రకటించారు. రూ. 44 లక్షల విలువైన టైర్లను నిందితులు అపహరించారని పోలీసులు తెలిపారు. గతంలో ఏయే ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గతంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రైవర్లను బెదిరించి లారీలను అపహరించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.  2021 జూలై 15న  తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆగి ఉన్న లారీని ఎత్తుకెళ్లారు. Regondaచెక్ పోస్టు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని దుండగులు తీసుకెళ్లిపోయారు. కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారు. లారీలో నిద్రపోతున్న డ్రైవర్, క్లినర్‌పై ఒక్కసారిగా దాడి చేశారు. వారిద్దరిని బెదిరించి  లారీతో పరారయ్యారు. లారీ డ్రైవర్, క్లీనర్ సెల్ ఫోన్లు తీసుకుని వారిని కారులో ఎక్కించుకుని అరిస్తే చంపేస్తామని బెదిరించి.. గుడెప్పడ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2020 ఆగష్టు 26న తమిళనాడు-ఏపీ సరిహద్దులో మొబైల్ లారీని దుండగులు అపహరించుకెళ్లారు.లారీని తీసుకెళ్లి పుత్తూరు దగ్గర మరాఠీ గేటు వద్ద వదిలి పరారయ్యారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు విచారణ చేపట్టారు. తమిళనాడు సరిహద్దు అవతలి నుంచే కొంతమంది లారీని ఫాలో అయినట్టు డ్రైవర్ పోలీసులకు తెలిపారు.

లారీలో 16 బాక్సుల్లో రూ.12 కోట్ల విలువైన 15వేల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.. ఈ మొబైల్ ఫోన్లను ముంబయికి తరలిస్తున్నారు. 8 పెట్టెల్లోని ఫోన్లను మాత్రమే దుండగులు అపహరించి మిగతా 8 పెట్టెలను వదిలేసి వెళ్లారు.మొబైల్ ఫోన్లను మరో లారీలోకి మార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

2020 జనవరి 24న కృష్ణా జిల్లా పామర్రులో లక్షల రూపాయల విలువైన రొయ్యలను దొంగలు సినిమా స్టైల్‌లో దోచుకుపోయారు. ఈ ఘటన పామర్రు మండలం కొమరవోలు వద్ద జరిగింది. రొయ్యల లోడుతో వస్తున్న లారీని కొమరవోలు వద్ద అడ్డగించిన దుండగులు లారీ డ్రైవర్‌ను కిందికి దించారు. డ్రైవర్‌ను చెట్టుకు కట్టేసి రూ.11 లక్షల విలువైన రొయ్యలను దోచుకెళ్లారు.లారీ డ్రైవర్ పామర్రు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu