ఈ బర్మా రోహింగ్యా హైదరాబాద్ లో ఎంతపని చేశాడంటే....

By Arun Kumar PFirst Published Aug 25, 2018, 6:06 PM IST
Highlights

 ఓ వివాహితను సోషల్ మీడియా ద్వారా లైంగికంగా వేధిస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పాటు మహిళ భర్తకు పంపుతూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితున్ని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బర్మా నుండి రోహింగ్యా వర్గానికి చెందిన ఓ కుటుంబం వలసవచ్చి రంగారెడ్డి జిల్లా బాలానగర్ లో నివాసముంటున్నారు. ఈ కుటుంబానికి చెందిన మహ్మద్ అన్వర్(24) బండ్లగూడలోని ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తున్నాడు. అయితే అదే కంపనీలో పనిచేసే ఓ రోహింగ్యా యువతితో ఇతడికి పరిచయం పెంచుకున్నాడు. దీంతో వీరిద్దరు కొద్దిరోజులు ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో వీరిద్దరు కలిసి కొన్ని ప్రైవేట్ ఫోటోలను తీసుకున్నారు.

అయితే ఆ యువతికి తల్లిదండ్రులు కెనడాలో ఉద్యోగం చేస్తున్న అలీ అక్బర్ అనే యువకుడికిచ్చి పెళ్ళి చేశారు. దీంతో తట్టుకోలేక పోయిన అన్వర్ ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు.

దీంతో ఓ ఫేక్ పేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని గతంలో దిగిన ప్రైవేట్ ఫోటోలను అందులో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి భర్తకు ఆ పోటోలను పంపించడం, అసభ్యకరమైన మెసేజ్ లు పంపించడం ప్రారంభించాడు. ఇలా ఆమెను మానసికంగా వేధిస్తూ రాక్షసానందం పొందుతుండేవాడు. ఫేక్ అకౌంట్ ద్వారా ఈ పని చేస్తూ తన పేరు బైటపడకుండా జాగ్రత్త పడ్డాడు.

అయితే బాధితురాలి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని అరెస్ట్  చేశారు. ఇతడి నుండి సెల్ ఫోన్ తో పాటు ఓ ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
click me!