పార్టీ పరంగా..: సుహాసిని పోటీపై పురంధేశ్వరి వ్యాఖ్యలు

Published : Nov 22, 2018, 01:18 PM IST
పార్టీ పరంగా..: సుహాసిని పోటీపై పురంధేశ్వరి వ్యాఖ్యలు

సారాంశం

పార్టీ పరంగా తాము వ్యతిరేకమైనా మేనకోడలిగా ఆమెకు తన దీవెనలు ఉంటాయని పురంధేశ్వరి చెప్పారు.భావసారూప్యత, సిద్ధాంతాలు లేని మహాకూటమిని, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న తన సోదరుడు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినీ పోటీ చేస్తుండడంపై బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  నందమూరి సుహాసినికి మీ సహకారం ఉంటుందా అనిని అడిగితే.. ఓ మేనత్తగా కోడలికి ఎప్పుడూ ఆశీర్వాదం ఉంటుందని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. 

పార్టీ పరంగా తాము వ్యతిరేకమైనా మేనకోడలిగా ఆమెకు తన దీవెనలు ఉంటాయని పురంధేశ్వరి చెప్పారు.భావసారూప్యత, సిద్ధాంతాలు లేని మహాకూటమిని, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. 

మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావుకు మద్దతుగా బుధవారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. బీజేపీని ఓడించేందుకు, నరేంద్ర మోడీని గద్దె దింపేందుకు మాత్రమే మహాకూటమి ఏర్పడిందని అన్నారు. మోడీని ఎందుకు గద్దె దింపాలో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్ పాలనపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.
 
 ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీఆర్‌ఎ్‌సలకు అవకాశం ఇచ్చిన మల్కాజిగిరి ప్రజలు ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి రాంచందర్‌రావు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family