రెబల్ అభ్యర్థి కాళ్లపై పడి బ్రతిమిలాడిన కాంగ్రెస్ అభ్యర్థి

Published : Nov 22, 2018, 01:15 PM IST
రెబల్ అభ్యర్థి కాళ్లపై పడి బ్రతిమిలాడిన కాంగ్రెస్ అభ్యర్థి

సారాంశం

పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు రెబల్స్ గా  ఇండిపెండెంట్ గా పోటీ దిగేందుకు నామినేషన్లు వేశారు.

తెలంగాణలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు టికెట్ దక్కిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. మరో వైపు రెబల్స్ ని బుజ్జగించే పనిలో పడ్డారు సీనియర్ నేతలు. ఈ క్రమంలో చేవెళ్లలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

అసలుమ్యాటరేంటంటే... వచ్చే నెలలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు రెబల్స్ గా  ఇండిపెండెంట్ గా పోటీ దిగేందుకు నామినేషన్లు వేశారు. రెబల్స్ రంగంలోకి దిగితే.. ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈ రోజు ఆఖరి తేదీ.

దీంతో.. రెబల్స్ ని బుజ్జగించే పనిలో పడ్డారు నేతలు. ఇదిలా  ఉండగా.. చెవేళ్ల  కాంగ్రెస్  అభ్యర్థి కేఎస్ రత్నం... తనకు సహకరించాలంటూ ఏకంగా రెబల్ అభ్యర్థి వెంకటస్వామి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడారు. రెబల్ అభ్యర్థిగా పోటీ నుంచితప్పుకోవాలని కోరారు. కాగా.. అలా బ్రతిమిలాడుతుండగా తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తే.. ఆ టికెట్ ని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కేఎస్ రత్నానికి కేటాయించారు.  ఈ నేపథ్యంలో వెంకటస్వామి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో పై సంఘటన చోటుచేసుకుంది. మరి కేఎస్ రత్నం అభ్యర్థనకు వెంకటస్వామి కరిగారో లేదో తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?