విరసం నేత వరవరరావుపై పూణే పోలీసులు సంచనలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ హత్య కుట్రలో వరవరరావు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. నేపాల్ నుంచి అత్యాధునిక ఎన్ ఫోర్ వెపన్ ను కొనుగోలు చెయ్యాలని ఓ మావోయిస్టు నేతకు హక్కుల నేత రోనా విల్సన్ ఆదేశించినట్లు లేఖలో పేర్కొన్నట్లు చెప్తున్నారు. నేపాల్ లోని కాంట్రాక్టర్ వరవరరావుకి తెలుసునని లేఖలో రోనా విల్సన్ పేర్కొ
పూణె: విరసం నేత వరవరరావుపై పూణే పోలీసులు సంచనలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ హత్య కుట్రలో వరవరరావు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. నేపాల్ నుంచి అత్యాధునిక ఎన్ ఫోర్ వెపన్ ను కొనుగోలు చెయ్యాలని ఓ మావోయిస్టు నేతకు హక్కుల నేత రోనా విల్సన్ ఆదేశించినట్లు లేఖలో పేర్కొన్నట్లు చెప్తున్నారు. నేపాల్ లోని కాంట్రాక్టర్ వరవరరావుకి తెలుసునని లేఖలో రోనా విల్సన్ పేర్కొన్నారు.
ఆయుధాలను మోదీ హత్యకు ఉపయోగించాలని రోనా విల్సన్ ఆదేశం. ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి పూర్తి అవగాహన ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పూణే ఆరోపణలను ప్రజాసంఘాలు ఖండించాయి. పూణే పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పూణే పోలీసులు ఆరోపణలపై కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు.