టీఆర్ఎస్‌కి పూల రవీందర్ రాజీనామా

Published : Feb 10, 2021, 10:50 AM IST
టీఆర్ఎస్‌కి పూల రవీందర్ రాజీనామా

సారాంశం

పీఆర్‌టీయూ సభ్యుల కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి  రాజీనామా చేసినట్టేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు.

హైదరాబాద్: పీఆర్‌టీయూ సభ్యుల కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి  రాజీనామా చేసినట్టేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు.

పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారంం నాడు పలు జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల ఉపాధ్యాయుల ధర్నాల్లో ఆయన పాల్గొన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన దర్నాలో పాల్గొనేందుకు పూల రవీందర్ రాగా ఉపాధ్యాయులు ఆయనను అడ్డుకొన్నారు.

 రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు చేసిన కృషిని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే హైద్రాబాద్ లో జరిగే మహాధర్నాలో పీఆర్టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామని ఆయన సూచించారు.

టీఆర్ఎస్ ముఖ్యం కాదన్నారు. పీఆర్టీయూనే తనకు ముఖ్యమన్నారు. పీఆర్టీయూ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని పూల రవీందర్ ప్రకటించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం