
ఆదిలాబాద్: సమత కేసులో దోషులకు ఉరి శిక్ష విధించడంపై సమాజం విజయంగా ఈ కేసును వాదించిన పీపీ రమణారెడ్డి అభిప్రాయపడ్డారు.ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సమత కేసులో దోషులకు ఉరి శిక్షను విధిస్తూ గురువారం నాడు తీర్పు చెప్పింది. ఈ తీర్పు తర్వాత పీపీ రమణారెడ్డి తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ తరహ ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు గాను ప్రజలు కూడ ఈ కేసులో సాక్ష్యాల కోసం పోలీసులకు సహకరించినట్టుగా చెప్పారు. దోషులకు శిక్ష పడేందుకు వీలుగా పోలీసులకు ప్రజలు సహకరించినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.
Also read:సమత కేసులో దోషులకు ఉరి: ఎస్పీ కాళ్లు మొక్కిన భర్త గోపి
ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా పోలీసులు అన్ని రకాల సాక్ష్యాలను సేకరించినట్టుగా ఆయన గుర్తు చేశారు. పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించినటటుగా ఆయన గుర్తు చేశారు. శాస్త్రీయంగా ఆధారాలను కోర్టుకు సమర్పించినట్టుగా ఆయన గుర్తు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉరిశిక్ష చోటు చేసుకొన్న ఘటన నాలుగోది అని పీపీ రమణారెడ్డి చెప్పారు. గతంలో వేర్వేరు కేసుల్లో మరో ముగ్గురికి ఉరి శిక్షలు విధించినట్టుగా రమణారెడ్డి చెప్పారు.
ఈ కేసులో దోషులు హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కేసులో దోషుల తరపున వాదించేందుకు ఎవరూ కూడ ముందుకు రాకపోవడంతోనే కోర్టే వారి తరపున వాదించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మరో వైపు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా దోషులు హైకోర్టులో అప్పీల్ చేసుకొనే హక్కు ఉందని పీపీ చెప్పారు.