జీడిమెట్లలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇంటిముందు నిలిపిన వాహనాలకు నిప్పు పెట్టాడు. దీంతో వరుసగా బైక్స్ కాలిపోయాయి. దాదాపు రూ.7లక్షల ఆస్తి నష్టం సంభవించింది.
హైదరాబాద్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో ఆగంతకుడు వీరంగం సృష్టించాడు. కాలనీలో ఇంటిముందు నిలిపి ద్విచక్రవాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇలా రెండు చోట్ల చేశాడు. దీంతో అక్కడ ఉన్న మొత్తం వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేసరికే ఘోరం జరిగిపోయింది. ఎగిసిపడుతున్న మంటలను స్థానికులు ఆర్పేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
గతంలోనూ ఈ సైకో ఆగంతకులు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
undefined
విశాఖ సైకో కిల్లర్ : భార్య వివాహేతర సంబంధం చూసి, తట్టుకోలేక సైకోగా, మహిళా ద్వేషిగా మారి..
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 16న పెద్దపల్లి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామంలో కనిపించిన వారినల్లా చితక బాదడంతో భరించలేని గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి మండలం లోని చీకురాయి గ్రామానికి చెందిన నార్ల కుమార్ అనే సైకో గ్రామంలో పలుమార్లు ఇలాగే వీరంగం సృష్టించాడు. పలుమార్లు గ్రామస్థులు మందలించినా సైకో కుమార్ లో మార్పు రాలేదు.
ఆ రోజు ఉదయం గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటి ముందు ఉన్న మురికి కాలువ శుభ్రం చేస్తున్న క్రమంలో సిబ్బందినిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్థులు సైకో కు దేహశుద్ది చేసి గ్రామ పంచాయితీ దగ్గర ఉన్న కుర్చీకి తాళ్లతో కట్టివేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సైకోని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.