జగన్ ను ఒప్పించి ఏపీలో షర్మిలను సీఎం చేయండి: విజయమ్మకు జగ్గారెడ్డిసలహా

By narsimha lodeFirst Published Sep 27, 2022, 12:46 PM IST
Highlights

మూడు రాజధానులకు బదులుగా మూడు రాష్ట్రాలు చేసి ముగ్గురు ముఖ్యమంత్రులు కావొచ్చని వైఎస్ విజయమ్మకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. షర్మిల తనను కేటీఆర్ కోవర్ట్ అంటూ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. 

హైదరాబాద్: వైఎస్ షర్మిలను సీఎం చేయాలనుకుంటే జగన్ కు నచ్చజెప్పి ఏపీలో సీఎం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఎస్ విజయమ్మకు సలహా ఇచ్చారు.మంగళవారం నాడు హైద్రాబాద్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు ఎందుకు మూడు రాష్ట్రాలు చేయాలని ఆయన ఏపీ సీఎం జగన్ కు సలహ ఇచ్చారు.అమరావతి, కడప, విశాఖలను రాజధానులుగా చేసుకుని పాలన చేయాలని జగ్గారెడ్డి సూచించారు. మూడు రాష్ట్రాలకు మీ కుటుంబంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కావచ్చన్నారు.  మీ ఇంట్లో వాళ్లే సీఎంలుగా ఉండాలా అని జగ్గారెడ్డి  షర్మిలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఎందుకు పాదయాత్ర చేయడం లేదో చెప్పాలన్నారు.  

తెలంగాణలో  కాంగ్రెస్, లెఫ్ట్ ,  బీజేపీ, ఎంఐఎం లున్నాయన్నారు. ఇన్ని పార్టీలతో షర్మిల పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఏపీలో మాత్రం ఇంత పోటీ ఉండదని జగ్గారెడ్డి చెప్పారు. మీ కుటుంబంలో పంచాయితీని రాష్ట్రాల మధ్య పంచాయతీగా మార్చొద్దని కూడ విజయమ్మకు జగ్గారెడ్డి సలహ ఇచ్చారు. షర్మిల ఏం చేసినా కూడా తెలంగాణలో నాయకురాలు కాలేదన్నారు. 

also read:మూడు రాజధానుల నిర్ణయం సరికాదు.. ఆ రోజు మేమే ఎక్కువగా ఏడ్చాం: జగన్, షర్మిలపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్.

షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తనను కోవర్ట్ అన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవర్ట్ అని తనను విమర్శించడం తనకు ఓ శాపమని అనుకొంటున్నానన్నారు. కేటీఆర్ కు తాను కోవర్ట్ అని షర్మిల  చేసిన విమర్శలపై కూడా ఆయన స్పందించారు. కేటీఆర్ తనకు అసెంబ్లీలో మాత్రమే కలుస్తాడని చెప్పారు. కేటీఆర్ అసలు కలవడన్నారు. నేను ప్రయత్నిస్తే కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.  కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నించినా కూడా వారి అపాయింట్ మెంట్లు లభ్యం కావన్నారు. కానీ తనపై కోవర్ట్ అంటూ విమర్శలు చేయడం ఏమిటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 

అన్ని కులాలు, మతాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను వారధిగా ఉంటానని చెప్పారు. వైఎస్ షర్మిల బీజేపీకి ఏజంట్, బినామీ అంటూ జగ్గారెడ్డి ఫైరయ్యారు. ఇందులో అనుమానం లేదన్నారు. బీజేపీకి అనుకూలంగా షర్మిల పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇవాళ తనకు వ్యతిరేకంగా షర్మిల విమర్శలు చేస్తే తాను సమాధానం చెబుతానన్నారు. నా జోలికి రావొద్దని నిన్ననే చెప్పాను,కానీ అయినా కూడా తనపై విమర్శలు చేశారన్నారు. 

రాష్ట్రంలో సరిగా ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.రూ. 10 లక్షలు ఆసుపత్రి బిల్లు అయితే కేవలం రూ. 30 వేలు ఇస్తున్నారన్నారు. గతంలో ఈ రకమైన పరిస్థితి  లేదని ఆయన గుర్తు చేశారు. కనీసం 80 శాతానికి పైగా బిల్లును చెల్లించే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ఆర్ , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సీఎంగా ఉన్న కాలంలో ఈ రకంగానే  ఆరోగ్య శ్రీ కింద బిల్లులు ఇప్పించామన్నారు. ఆరోగ్య శ్రీ అమలుపై మంత్రి హరీష్ రావు కేంద్రీకరించాలని జగ్గారెడ్డి కోరారు.

షర్మిలకు జగారెడ్డి వార్నింగ్

రాజకీయ వ్యభిచారి అని తనను విమర్శిస్తారా అని జగ్గారెడ్డి షర్మిలపై మండిపడ్డారు. నేను నిన్ను అలా అంటే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. హద్దు మీరి మాట్లాడొద్దని షర్మిలకు జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. షర్మలా నీకు బుద్దుందా అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మగవాళ్లతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అని జగ్గారెడ్డి షర్మిలను అడిగారు. వైఎస్ పరువు తీయవద్దని జగ్గారెడ్డి సలహ ఇచ్చారు. కంట్రోల్ ఉండాలని ఆయన షర్మిలకు సూచించారు.  ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ రిపీట్ అయితే తాను ఊరుకోబోనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. 
 

click me!