టెన్త్ విద్యార్థుల మాదిరిగానే... వారికీ ఆ వెసులుబాటు: టీఎస్ హైకోర్టులో పిటిషన్

By Arun Kumar PFirst Published Jun 16, 2020, 7:56 PM IST
Highlights

కరోనా వ్యాప్తి సమయంలో పదో తరగతి విద్యార్ధులకు బోర్డ్ ఎగ్జామ్ లేకుండానే ప్రమోట్ చేసినట్లు బీటెక్,డిగ్రీ విద్యార్థులకు కూడా ప్రమోట్ చేయాలన్న డిమాండ్ మొదలయ్యింది. 

హైదరాబాద్: కరోనా వ్యాప్తి సమయంలో పదో తరగతి విద్యార్ధులకు బోర్డ్ ఎగ్జామ్ లేకుండానే ప్రమోట్ చేసినట్లు బీటెక్,డిగ్రీ విద్యార్థులకు కూడా సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని తెలంగాణ హైకోర్టు లో ఓ పిటిషన్ దాఖలయ్యింది. రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేసిన జేఎన్‌టీయూ ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపింది. ప్రభుత్వం చెప్పేంతవరకు పరీక్షలు నిర్వహించమని జేఎన్‌టీయూ పేర్కొంది. టెన్త్ క్లాస్ విద్యార్థులను ప్రమోట్ చేసిన మాదిరిగా డిగ్రీ, బిటెక్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. 

read more  

ఇప్పుడున్న పరిస్థితుల్లో  పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా  కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. అలాగని మరీ ఆలస్యమైతే విద్యార్థులు టెన్షన్ పడుతారని... నెక్స్ట్ సిలబస్  కి సమయం ఉండదన్న పిటీషనర్ న్యాయస్థానానికి తెలిపారు. 

అయితే ఈ పిటీషన్ పై తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది హైకోర్టు. పిటినర్ కోరినట్లు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తారా? లేకపోతే పరీక్షలు నిర్వహిస్తారా? అన్నది తదుపరి విచారణలో తేలనుంది. 

click me!