రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు...ఈ జిల్లాల్లో అయితే భారీగా: వాతావరణ కేంద్రం

Arun Kumar P   | Asianet News
Published : Jun 16, 2020, 06:31 PM ISTUpdated : Jun 16, 2020, 06:40 PM IST
రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు...ఈ జిల్లాల్లో అయితే భారీగా: వాతావరణ కేంద్రం

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల వర్షాలు  కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కోమరంభీం, నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని... ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

read more    కొత్త పట్టాదారులకు వచ్చే ఏడాదిలోనే నిధులు: రైతు బంధు మార్గదర్శకాలివే

పశ్చిమ మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్ లో చాలా  ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించారు. తూర్పు విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా జూన్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.