రాజ్ భవన్ ముట్టడిని పురస్కరించుకొని కాంగ్రెస్ నేతలు పోలీసు అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలపై పోలీసులు కేసులు పెట్టారు.
హైదరాబాద్: CLP నేత Mallu Bhatti Vikramarka విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి Renuka Chowdhuryపై హైద్రాబాద్ Panjagutta పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.Rajbhavan ముట్టడి సమయంలో Congressనేతలు దురుసుగా వ్యవహరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు దురుసుగా వ్యవహరించడాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొంది. డీసీపీ జోయ్ డేవిస్ ను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నెట్టివేశారు. డీసీపీతో భట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు. మరో వైపు పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పు బట్టారు.ఈ క్రమంలోనే డీసీపీ జోయల్ డేవిస్ ను నెట్టి వేశారు.
undefined
రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ని పోలీసులు అనుసరించారు. డోంట్ టచ్ మీ అంటూ రేణుకా చౌదరి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను రాజ్ భవన్ లోకి వెళ్తే యాక్షన్ తీసుకోవాలన్నారు. తాను కట్టిన పన్నులతో వేసిన రోడ్డుపై నడిస్తే మీకేం అభ్యంతరమని రేణుకా చౌదరి పోలీసులను ప్రశ్నించారు. ఓ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ విషయాన్ని గమనించిన రేణుకా చౌదరి పోలీసుల తీరుపై మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులను నెట్టివేశారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. అదే సమయంలో అక్కడే ఉన్న Panjagutta SI రేణుకా చౌదరికి అడ్డుపడే ప్రయత్నం చేయడంతో రేణుకా చౌదరి ఎస్ఐ చొక్కా పట్టుకొని నిలదీశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు కూడా షాక్ తిన్నారు. వెంటనే ఓ మహిళా పోలీస్ రేణుకా చౌదరి చేయిని పంజాగుట్ట ఎస్ఐ చొక్కా నుండి లాగివేశారు. రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న రేణుకా చౌదరిని మహిళా పోలీసులు చుట్టుముట్టి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి కొడతానని కూడా రేణుకా చౌదరి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పంజాగుట్ట ఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీపీ 353 సెక్షన్ కింద రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు దాడి చేశారని ఎఐసీసీ నేత రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం నాడు దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది. ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది. పోలీసుల భద్రతను చేధించుకొని కాంగ్రెస్ నేతలు కొందరు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు.
also read:రాజ్‌భవన్ ముట్టడి: పోలీసులతో దురుసుగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలపై కేసులకు చాన్స్
ఖైరతాబాద్ జంక్షన్ వద్ద బైక్ కు కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ కు నిప్పు పెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సుపై నిలబడి ఆందోళన చేశారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.