ప్రియాంక నిందితులకు షాక్: వాదించేది లేదు, బార్ అసోసియేషన్ తీర్మానం

By Siva Kodati  |  First Published Nov 30, 2019, 5:49 PM IST

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రజలు భగ్గుమంటున్నాయి. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ పలువురు కోరుతున్నారు. ఇదే సమయంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. 


డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రజలు భగ్గుమంటున్నాయి. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ పలువురు కోరుతున్నారు. ఇదే సమయంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రియాంక నిందితుల పక్షాన లాయర్లు ఎవ్వరూ వాదించకూడదని నిర్ణయించింది, అలాగే బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయ సహాయం చేయాలని తీర్మానించాయి. అలాగే నిందితులకు బెయిల్ కోసం ఎవరూ సహకారం అందించకూడదని విజ్ఞప్తి చేశాయి.

Latest Videos

undefined

Also read:షాద్‌నగర్ పీఎస్‌ వద్ద హైటెన్షన్: నిందితుల తరలింపు, జనంపై లాఠీఛార్జీ

నిందితులకు కఠినమైన శిక్షపడే వరకు న్యాయపోరాటం చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇంతటి హేయమైన చర్యను తాము ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది. 

తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి. ఓ ఆడిపిల్ల తల్లీగా నిందితుల తరపున ఏ న్యాయవాదీ వాదించొద్దని అభ్యర్ధిస్తున్నాని ఆయన వాపోయారు.

సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన లేకే తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని.. మరో ఆడపిల్లకు ఇలా జరగకుండా పోలీసులు అవగాహన కల్పించాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

నిందితులకు ఉరిశిక్ష వేస్తేనే న్యాయం జరిగినట్లని... ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారికి ఉరిశిక్ష పడితినే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం నిందితుల తరపున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రావొద్దని సూచించారు. ప్రియాంకరెడ్డిపై అత్యంతదారుణంగా ప్రవర్తించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకరెడ్డి హత్యను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. 

డాక్టర్ ప్రియాంకరెడ్డికి న్యాయం చేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిందితులను తమకు అప్పగిస్తే తాము చూసుకుంటామని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఉదయం నుంచి తిండి, నీరు లేకుండా స్టేషన్ వద్దే బైఠాయించారు.

తమకు సహకరిస్తే న్యాయం చేస్తామని డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జనంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు పీఎస్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసు బలగాలపైకి చెప్పులు విసిరారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు లాఠీఛార్జీ చేసి ప్రజలను చెదరగొట్టారు.

Also Read:Priyanka Reddy case: నా కొడుకును చంపేయండి.. నిందితుడి తల్లి అభ్యర్ధన

ఈ నేపథ్యంలో షాద్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఎస్ వద్దకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం చేరుకుంటుండటంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మార్గమధ్యంలో నిందితులపై ప్రజలు దాడి చేయకుండా వారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. 

click me!