టీపీసీసీ పనితీరుపై ప్రియాంక గాంధీ నజర్.. మాణిక్యం ఠాకూర్ కు ఉద్వాసన ?.. రేవంత్ అధికారాలకు కత్తెర ?

By team teluguFirst Published Dec 8, 2022, 12:30 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పనితీరుపై హైకమాండ్ దృష్టి సారించింది. అందులో భాగంగా పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. మాణిక్యం ఠాకూర్ ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. 

టీపీసీపీ పనితీరుపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందటంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి డిపాజిట్ దక్కకపోవడం, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీని వీడడంపై చాలా కాలంగా హైకమాండ్ అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో టీపీసీసీపై హైకమాండ్ దృష్టి నిలిపింది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తోంది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికారాలకు కత్తెర వేయడం, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ ను తొలగించే అవకాశం కనిపిస్తోంది.

సీపీఎం రికార్డు సమం చేసిన కమలం: నాడు బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్, నేడు గుజరాత్‌లో బీజేపీ వరుస విజయాలు

రెండేళ్లకు పైగా తెలంగాణ వ్యవహారాలకు సారథ్యం వహించిన ఠాగూర్ స్వచ్ఛందంగా రాష్ట్ర ఇంఛార్జి పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారని రేవంత్ శిబిరం పేర్కొంటున్నప్పటికీ, ఆయనను తొలగించాలని పార్టీ హైకమాండ్ కోరుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ పీసీసీ పనితీరును పర్యవేక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీని పునర్వవస్థీకరించాలని చూస్తున్నారు. ‘డెక్కన్ క్రానికల్’ కథనం ప్రకారం.. ఈ పునర్వ్యవస్థీకరించబడిన పీసీసీలో కొత్త ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహక కమిటీతో పాటు కొత్త డీసీసీ అధ్యక్షులు ఉంటారు. మరో 100 మంది నాయకులను పార్టీ కార్యకర్తలుగా నియమించే అవకాశం ఉంది. 

జైలు నుంచి విడుదలైన రామచంద్ర భారతి, నందకుమార్.. వెంటనే మళ్లీ అరెస్ట్..

ఇటీవలి అనేక పరాజయాల తరువాత తెలంగాణలో పార్టీ పేలవమైన పనితీరును సమీక్షించాలని పార్టీలోని అనేక వర్గాల నుండి వచ్చిన ఫిర్యాదుల తరువాత పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు జరగనున్నాయి. తనను రిలీవ్ చేయాలని మాణిక్యం ఠాకూర్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కోరినట్లు ఢిల్లీలో టాక్ ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయనను రాజీనామా చేయమని కోరడం ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలు, అలాగే తెలంగాణలో వరుస పరాజయాలు దీనికి ప్రధాన కారణమని అని సీనియర్ నాయకుడు చెప్పారని ‘డెక్కన్ క్రానికల్’ నివేదించింది.

అర్థరాత్రి దంపతులను అటకాయించి.. మహిళను కారులో ఎక్కాలంటూ దాడి.. వీడియో వైరల్...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ నవంబర్ 22 న సోనియా గాంధీకి రాసిన లేఖను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో ఏఐసీసీ ఇంచార్జీలు, పీసీసీ అధ్యక్షుల పనితీరు సరిగా లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో డబ్బు పలుకుబడి పెరగడం, అధికార టీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడాన్ని శశిధర్ రెడ్డి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.

click me!