కరోనా ఎఫెక్ట్: ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

Published : Apr 06, 2021, 03:44 PM ISTUpdated : Apr 06, 2021, 04:06 PM IST
కరోనా ఎఫెక్ట్: ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

సారాంశం

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

నల్గొండ: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

కరోనా కారణంగా ఏడాది నుండి జీతాలు రాకపోవడంతో  ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకొంటున్నాయి. రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి.  భార్య ఇల్లు వదిలివెళ్లిపోయింది. దీంతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. మృతుడిని రవిగా గుర్తించారు. ఆయన సాగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. 

ఇటీవలనే ఒక్క నెల రోజుల పాటు స్కూల్స్ తిరిగి తెరిచారు. అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి విద్యా సంస్థలను తిరిగి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్దికంగా చితికిపోయారు. మృతుడికి ఇద్దరు పిల్లలు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: హైద‌రాబాదీలు జ‌ర‌పైలం.. మటన్‌లో ఎద్దు మాంసం, కుళ్లిన చేప‌లు
Heavy Rain Alert : బలపడుతున్న అల్పపీడనం, 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ.. అతిభారీ వర్షాలతో ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే