సర్పంచ్‌కిస్తే సరిపోతుందా... నాకివ్వవా: మామూలు కోసం రియల్టర్‌కు మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు

By Siva KodatiFirst Published Apr 6, 2021, 2:19 PM IST
Highlights

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వసూళ్ల దందా ఆడియో టేప్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఓ వెంచర్ విషయంలో మంత్రి మల్లారెడ్డి రియల్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. వెంచర్ వేసినందుకు తనకు మామూలు ఎందుకు ఇవ్వలేదంటూ మంత్రి ప్రశ్నించారు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వసూళ్ల దందా ఆడియో టేప్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఓ వెంచర్ విషయంలో మంత్రి మల్లారెడ్డి రియల్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు.

వెంచర్ వేసినందుకు తనకు మామూలు ఎందుకు ఇవ్వలేదంటూ మంత్రి ప్రశ్నించారు. అయితే తాను సర్పంచ్‌కు మామూలు ఇచ్చానని చెప్పాడు రియల్టర్. సర్పంచ్‌కు ఇస్తే సరిపోదని.. తనకు, ఎమ్మెల్యేకు మామూలు ఇవ్వాల్సిందేనని అప్పటి వరకు వెంచర్ అపేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. 

కాగా, గతేడాది మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైన సంగతి తెలిసిందే. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలో తన భూమిని కబ్జా చేయించారని శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మంత్రి అనుచరులు తన స్థలంలో ప్రహరీగోడ నిర్మించారని, తన లాయర్‌ కూడా మంత్రితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వారు తప్పుడు అగ్రిమెంట్‌ను సృష్టించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

click me!