తెలంగాణలో కరోనా పరిస్ధితి ఇది: 24 గంటల్లో 3877 కేసులు.. జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్రత

By Siva Kodati  |  First Published Jan 28, 2022, 8:23 PM IST

తెలంగాణలో (corona cases in telangana) కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,414 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 3,877 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,54,976కి పెరిగింది.


తెలంగాణలో (corona cases in telangana) కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,414 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 3,877 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,54,976కి పెరిగింది. తాజాగా కరోనా బారిన పడి ఇద్దరు ప్రాణాలు (covid deaths in telangana) కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 2,981 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7,10,479 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 40,414 యాక్టీవ్ కేసులు వున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.11 శాతంగా ఉంది. ఈ రోజు వెలుగు చూసిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1189 మందికి పాజిటివ్‌గా తేలింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 38, భద్రాద్రి కొత్తగూడెం 116, జీహెచ్ఎంసీ 1189, జగిత్యాల 83, జనగామ 45, జయశంకర్ భూపాలపల్లి 33, గద్వాల 34, కామారెడ్డి 45, కరీంనగర్ 92, ఖమ్మం 112, మహబూబ్‌నగర్ 95, ఆసిఫాబాద్ 21, మహబూబాబాద్ 50, మంచిర్యాల 104, మెదక్ 44, మేడ్చల్ మల్కాజిగిరి 348, ములుగు 23, నాగర్ కర్నూల్ 66s, నల్గగొండ 133, నారాయణపేట 24, నిర్మల్ 56, నిజామాబాద్ 107, పెద్దపల్లి 110, సిరిసిల్ల 47, రంగారెడ్డి 241 సిద్దిపేట 90, సంగారెడ్డి 93, సూర్యాపేట 45, వికారాబాద్ 46, వనపర్తి 45, వరంగల్ రూరల్ 43, హనుమకొండ 140, యాదాద్రి భువనగిరిలో 119 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Latest Videos

undefined

మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా నిత్యం రెండు లక్షలకు పైగానే (Coronavirus)  పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే, కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల్లో స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల న‌మోదైంది.  గురువారం 2.8 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 2.51 లక్షలకు (Coronavirus) తగ్గాయి. దీంతో పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 2,51,209 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్‌-19 కేసులు 4,06,22,709కి చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,80,24,771 మంది బాధితులు కరోనా వైరస్(Coronavirus) నుంచి కోలుకున్నారు.  గ‌త 24 గంట‌ల్లోనే 3 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకోవ‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. కొత్త‌గా  3,47,443 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు అధికం అవుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం  21,05,611 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.

క‌రోనా (Coronavirus) మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ (Coronavirus) తో పోరాడుతూ కొత్తగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఇప్పటివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  4,92,327కు పెరిగింది. కరోనా కేసులు తక్కువవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.28 శాతానికి తగ్గింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు 1,64,44,73,216 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. అంద‌లో మొద‌టి డోసు తీసుకున్న‌వారు 89.1 కోట్ల మంది ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారు 69.9 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,21,66,248 క‌రోనా (Coronavirus) ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 14,62,261 క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 
 

Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.28.01.2022 at 5.30pm) pic.twitter.com/lzHrZBBWq0

— IPRDepartment (@IPRTelangana)
click me!