సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్... జైలు శిక్ష?

By ramya NFirst Published Feb 20, 2019, 10:07 AM IST
Highlights

సెల్ ఫోన్ మాట్లాడుతూ.. బైక్ డ్రైవ్ చేసినందుకు ఓ వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష విధించారు. 

సెల్ ఫోన్ మాట్లాడుతూ.. బైక్ డ్రైవ్ చేసినందుకు ఓ వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష విధించారు. కాగా.. అంత చిన్న నేరానికి నాలుగు రోజులు జైలు శిక్ష విధించడం పై హైకోర్టు తప్పిపట్టింది. చిన్న నేరానికి జరిమానా వేసి హెచ్చరించకుండా అంత పెద్ద శిక్ష విధించడం సరికాదంది. యువకుడిగా ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తే భవిష్యత్తులో అతనితోపాటు వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో శిక్ష విధించే ముందు పరిశీలించాలని కింది కోర్టులకు సూచించింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. నగరానికి చెందిన భరద్వాజ అనే యువకుడు ఫోన్ మాట్లాడుతూ..డ్రైవ్ చేశాడని  నాలుగు రోజులపాటు జైలు శిక్ష విధించింది. కాగా..జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ భరద్వాజ మేనమామ హైకోర్టులో అత్యవసరంగా మంగళవారం ఉదయం కోర్టు అనుమతి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

చిన్న నేరానికి అంత శిక్ష అవసరం లేదని హైకోర్టు...  సైబరాబాద్ నాలుగో మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ని మందలించింది. రూ.500 జరిమానా  చెల్లిస్తే చాలాని తీర్పు వెలువరించింది. 

click me!