మల్కాజ్ గిరిలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

By Sairam Indur  |  First Published Mar 15, 2024, 9:14 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి కోసం ఆయన రోడ్ షో నిర్వహించారు. దీనికి భారీ స్పందన లభించింది.


లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 

Latest Videos

ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. మాల్కాజ్ గిరి లో బీజేపీ అభ్యర్థి విజయం కోసం రోడ్ షోలో పాల్గొన్నారు. 

శుక్రవారం సాయంత్రం ఈ రోడ్ షో ప్రారంభమైంది. దీనికి భారీ స్పందన లభించింది. రోడ్ షో కు ఇరు వైపుల భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ రోడ్ షో మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి క్రాస్ రోడ్ వరకు సాగింది. 

ప్రధాని మోడీని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ప్రధాని ఉన్న వాహనంపై బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. 1.2 కిలో మీటర్లు సాగిన ఈ రోడ్ షో కు సుమారు గంట సమయం పట్టింది. 

ఈ రోడ్ షో అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ భవన్ కు వెళ్లారు. నేటి రాత్రి ఆయన అక్కడ ఉండనున్నారు. 

click me!