లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను నేటి సాయంత్రం ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నేటి మధ్యాహ్నం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. అప్పటి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు అరెస్ట్ నోటీసులు అందించిన ఈడీ అధికారులు.. అరెస్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
BRS MLC Kavitha arrested in Delhi Liquor Scam case
KTR & Harish Rao reached to her residence
She will be taken to Delhi likely for further questioning https://t.co/RmvmyoOMTj pic.twitter.com/d6s7dq2y9k
లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ గానే చెప్పవచ్చు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ఒక రోజు ముందు ఈ అరెస్ట్ చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేటి సాయంత్రం 8.45 నిమిషాలకు కవితను ఢిల్లీ తీసుకెళ్లేందుకు విమాన టిక్కెట్ బుక్ చేసినట్టు సమాచారం.