మరింత తీవ్రరూపంలోకి కరోనా... తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కేసు

By Arun Kumar PFirst Published Mar 21, 2020, 4:51 PM IST
Highlights

తెలంగాణలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు కేవలం విదేశాల నుండి వచ్చినవారిలోనే ఈ వైరస్ కనిపించగా తాజాగా వారినుండి స్థానికులకు వ్యాపించడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటివరకు విదేశాల నుండి వచ్చినవారిలోనే ఈ వైరస్ లక్షణాలు బయటపడగా తాజాగా రాష్ట్రంలో మొదటి కాంటాక్ట్ కేసు నమోదయ్యింది. ఇండోనేషియా నుండి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తి నుండి ఓ వ్యక్తికి ఈవైరస్ సంక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో వైరస్ సోకినవారి సంఖ్య 21కి చేరింది. 

ఇప్పటికే కోవిడ్19ని పూర్తిగా నిరోధించడానికి కేంద్ర  ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించారు. అందులోభాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. స్కూళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు ఇలా జనాలు ఎక్కువగా గుమిగూడే అవకాశమున్న అన్నింటిని క్లోజ్  చేయించారు. అయినప్పటికి ఈ వైరస్ విజృంభిస్తూనే వుంది. 

read more  ప్రధానిని హేళన చేస్తారా, ఇడియట్స్ .. కేసీఆర్ ఫైర్

కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇటలీలోని పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 18 మందికి ఏ విధమైన ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు.   

కరీంనగర్ కు విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా వైరస్ ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఆందోళన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. డిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వారు కరీనగర్ కు వచ్చినట్లు తెలుస్తోంది.  

విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నవారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కజికిస్తాన్, దుబాయ్, ఇండోనేషియాల నుంచి వచ్చినవారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

read more  తెలంగాణలో 21 కరోనా కేసులు, 24 గంటల జనతా కర్ఫ్యా: కేసీఆర్

తెలంగాణలో 104 కాల్ సెంటర్ కు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం కరోనా కట్టడికి 116.28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ల్యాబ్స్, ప్రత్యేక పరికరాల కోసం 33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. క్వారంటైన్, స్క్రీనింగ్ కోసం 83.25 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

click me!